Share News

జీఈ ఏరోస్పేస్‌ రూ.240 కోట్ల పెట్టుబడి

ABN , Publish Date - Apr 05 , 2024 | 02:14 AM

పుణెలోని తమ తయారీ కేంద్రాన్ని అప్‌గ్రేడ్‌ చేయడానికి రూ.240 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు జీఈ ఏరోస్పేస్‌ ప్రకటించింది. కొత్త యంత్రసామగ్రి, పరికరాలు, స్పెషలైజ్డ్‌ పరికరాల కొనుగోలుపై...

జీఈ ఏరోస్పేస్‌ రూ.240 కోట్ల పెట్టుబడి

పుణె: పుణెలోని తమ తయారీ కేంద్రాన్ని అప్‌గ్రేడ్‌ చేయడానికి రూ.240 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు జీఈ ఏరోస్పేస్‌ ప్రకటించింది. కొత్త యంత్రసామగ్రి, పరికరాలు, స్పెషలైజ్డ్‌ పరికరాల కొనుగోలుపై ఈ నిధులు వ్యయం చేయనున్నట్టు తెలిపింది. 2015 సంవత్సరంలో ప్రారంభమైన ఈ కేంద్రంలో వాణిజ్య జెట్‌ ఇంజన్లకు అవసరం అయిన విడిభాగాలు తయారుచేస్తారు. ఈ ప్లాంట్‌లో తయారుచేసిన విడిభాగాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీఈ ప్లాంట్లకు సరఫరా చేయనున్నట్టు తెలిపింది.

Updated Date - Apr 05 , 2024 | 02:14 AM