Share News

వాటర్‌ ట్యాంకుల తయారీ ప్లాంట్‌లో పూర్తిగా పవన విద్యుత్‌ వినియోగం

ABN , Publish Date - Sep 13 , 2024 | 05:17 AM

వాటర్‌ ట్యాంకులు, పైపులు, ఫిట్టింగ్స్‌ తయారీ సంస్థ ఆర్‌ సీ ప్లాస్టో ట్యాంక్స్‌ అండ్‌ పైప్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. పర్యావరణ పరిరక్షణ, సస్టెయినబిలిటీ కోసం కీలకమైన చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది...

వాటర్‌ ట్యాంకుల తయారీ ప్లాంట్‌లో పూర్తిగా పవన విద్యుత్‌ వినియోగం

ర్‌సీ ప్లాస్టో

హైదరాబాద్‌: వాటర్‌ ట్యాంకులు, పైపులు, ఫిట్టింగ్స్‌ తయారీ సంస్థ ఆర్‌ సీ ప్లాస్టో ట్యాంక్స్‌ అండ్‌ పైప్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. పర్యావరణ పరిరక్షణ, సస్టెయినబిలిటీ కోసం కీలకమైన చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా మహారాష్ట్ర, నాగ్‌పూర్‌లోని వాటర్‌ ట్యాంకుల తయారీ ప్లాంట్‌లో 100ు పునరుత్పాదక ఇంధనాన్ని వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. మహారాష్ట్రలోని నందర్బర్‌ వద్ద ఏర్పాటు చేసిన రెండు పవన విద్యుత్‌ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను పూర్తిగా ఈ ప్లాంట్‌కు ఉపయోగిస్తున్నట్లు ఆర్‌ సీ ప్లాస్టో పేర్కొంది. ఒక్కో పవన విద్యుదుత్పత్తి ప్లాంట్‌ సామర్థ్యం 2.1 మెగావాట్లుగా ఉందని తెలిపింది. సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడకుండా పూర్తిగా రెన్యువబుల్‌ ఎనర్జీకి మారటం ద్వారా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించి ప్లాస్టో.. ఇతర పరిశ్రమలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొంది.

Updated Date - Sep 13 , 2024 | 05:17 AM