Share News

Financial Changes: జీఎస్టీ నుంచి ఫాస్ట్‌ట్యాగ్ దాకా.. మార్చి నుంచి మారనున్న రూల్స్

ABN , Publish Date - Feb 29 , 2024 | 06:24 PM

మారుతున్న కాలానికి అనుగుణంగా అప్పుడప్పుడు ఆర్థికరమైన మార్పులు (Financial Changes) చోటు చేసుకుంటుంటాయి. ఇప్పుడు ఈ ఏడాదిలో మార్చి 1వ తేదీ నుంచి కూడా కొన్ని కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇవి సాధారణ ప్రజల రోజువారీ కార్యకలాపాలపై.. అలాగే బ్యాంకులు, ఇతర వ్యాపారులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

Financial Changes: జీఎస్టీ నుంచి ఫాస్ట్‌ట్యాగ్ దాకా.. మార్చి నుంచి మారనున్న రూల్స్

మారుతున్న కాలానికి అనుగుణంగా అప్పుడప్పుడు ఆర్థికరమైన మార్పులు (Financial Changes) చోటు చేసుకుంటుంటాయి. ఇప్పుడు ఈ ఏడాదిలో మార్చి 1వ తేదీ నుంచి కూడా కొన్ని కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇవి సాధారణ ప్రజల రోజువారీ కార్యకలాపాలపై.. అలాగే బ్యాంకులు, ఇతర వ్యాపారులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ మార్పుల జాబితాలో.. జీఎస్టీ కొత్త రూల్, ఫాస్టాగ్ డీయాక్టివేషన్, బ్యాంకు హాలిడేస్ వంటివి ఉన్నాయి. పదండి.. మార్చి 1 నుంచి జరగనున్న ఆ మార్పులేంటో ఈ వార్తలో తెలుసుకుందాం.


* జీఎస్టీ న్యూ రూల్ (GST New Rule)

రూ.5 కోట్ల కంటే ఎక్కువగా టర్నోవర్ ఉండే వ్యాపారు లేదా వ్యాపారా సంస్థలు.. బిజినెస్-టు-బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కోసం ఈ-ఇన్‌వాయిస్ వివరాల్ని తప్పకుండా చేర్చాల్సి ఉంటుంది.

* ఫాస్టాగ్ డీయాక్టివేషన్ (FASTag Deactivation)

ఫిబ్రవరి 29వ తేదీ వరకు కేవైసీ (KYC) పూర్తి చేయని ఫాస్టాగ్స్‌ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) డీయాక్టివేట్ చేస్తుంది. గతంలో ఈ గడువు జనవరి 31వ తేదీ వరకు ఉండగా.. దానిని ఫిబ్రవరి 29వ తేదీ వరకు పొడిగించారు. ఒక వాహనానికి ఒకే పాస్టాగ్ ఉండాలన్న ఉద్దేశంతో.. ఫాస్టాగ్ ఈకేవైసీని NHAI తప్పనిసరి చేసింది.

* SBI క్రెడిట్ కార్డ్ బిల్లు కాలిక్యులేషన్ (SBI Credit Card Bill Calculation)

ఒక రోజుకు మినిమం బిల్లుకు సంబంధించిన నిబంధనలను SBI క్రెడిట్ కార్డు మార్చనుంది. ఈ కొత్త రూల్ మార్చి 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే వినియోగదారులకు అందించినట్లు SBI తెలిపింది.

* పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ డెడ్‌లైన్ (Paytm Payments Bank Deadline)

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, దాని సేవలపై నిషేధాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 15వ తేదీ వరకు పొడిగించింది. గడువు ముగిశాక వినియోగదారులు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఎలాంటి లావాదేవీలు జరపలేరు. అయితే.. ప్రస్తుతం ఉన్న డబ్బుని విత్‌డ్రా చేసుకోవచ్చు.

* బ్యాంకు హాలిడేస్ (Bank holidays)

మార్చి నెలలో బ్యాంకులకు మొత్తం 14 రోజులు సెలవులున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 10 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఐదు ఆదివారాలతో పాటు రెండు సెకండ్ సాటర్‌డేస్, మహా శివరాత్రి (మార్చి 8), హోలీ (మార్చి 25), గుడ్ ఫ్రైడే (మార్చి 29) రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

* MCD ఆస్తి జియో-ట్యాగింగ్ (Geo-tagging of MCD property)

మార్చి 1వ తారీఖు నుంచి ప్రాపర్టీ యజమానులు MCD యూనిఫైడ్ మొబైల్ యాప్ ద్వారా తమ ప్రాపర్టీలను జియో-ట్యాగ్ చేయకపోతే.. దేశ రాజధాని ఢిల్లీలో ఆస్తి పన్నుపై 10 శాతం తగ్గింపును పొందలేరు. కాబట్టి.. త్వరపడండి.

* స్టాక్ మార్కెట్ సెలవులు (Stock Market Holidays)

మహా శివరాత్రి (మార్చి 8), హోలీ (మార్చి 25), గుడ్ ఫ్రైడే (మార్చి 29) రోజుల్లో స్టాక్ మార్కెట్లు మూసివేయబడతాయి.

Updated Date - Feb 29 , 2024 | 06:25 PM