10 నెలల్లో ఫ్రాంక్స్ లక్ష అమ్మకాల మైలురాయి
ABN , Publish Date - Jan 25 , 2024 | 04:21 AM
మారుతి సుజుకీ ఫ్రాంక్స్ కారు 10 నెలల కాలవ్యవధిలోనే లక్ష అమ్మకాల మైలురాయిని దాటింది. ఇది ఒక రికార్డు, పరిశ్రమలో ఈ కారు ఒక బెంచ్‌మార్క్...
న్యూఢిల్లీ: మారుతి సుజుకీ ఫ్రాంక్స్ కారు 10 నెలల కాలవ్యవధిలోనే లక్ష అమ్మకాల మైలురాయిని దాటింది. ఇది ఒక రికార్డు, పరిశ్రమలో ఈ కారు ఒక బెంచ్‌మార్క్ నిర్దేశించిందని కంపెనీ ప్రకటించింది. దేశీయ మార్కెట్లో ఫ్రాంక్స్ కారును గత ఏడాది ఏప్రిల్ 24వ తేదీన ప్రవేశపెట్టారు. 2022లో ఎస్‌యూవీల విభాగంలో తమ వాటా 10.4 శాతం కాగా అది 19.7 శాతానికి చేరడానికి ఈ కారు దోహదపడిందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీ వాస్తవ తెలిపారు.