ఎఫ్‌పీఐ పెట్టుబడులు రూ.లక్ష కోట్లు
ABN , Publish Date - Jul 08 , 2024 | 06:20 AM
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ ఏడాది ఇంతవరకు భారత ఈక్విటీ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు రూ.1.16 లక్షల కోట్లకు చేరుకున్నాయి. జూలై 5వ తేదీ నాటికి...

న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ ఏడాది ఇంతవరకు భారత ఈక్విటీ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు రూ.1.16 లక్షల కోట్లకు చేరుకున్నాయి. జూలై 5వ తేదీ నాటికి డిపాజిటరీల సమాచారం ప్రకారం ఈ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐ పెట్టుబడి రూ.7,962 కోట్లుంది. ఈ నెల చివరిలో ప్రతిపాదించనున్న కేంద్ర బడ్జెట్, త్వరలో ప్రారంభం కానున్న కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ పెట్టుబడుల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. దేశంలో రాజకీయ స్థిరత్వం, మార్కెట్లలో ఏర్పడిన పునరుజ్జీవం ఆధారంగా జూన్‌లో కూడా ఎఫ్‌పీఐలు రూ.26,565 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇది కాకుండా వారు డెట్ మార్కెట్లో రూ.6,304 కోట్లు పెట్టుబడులుగా పెట్టారు.