Share News

తాన్లా బోర్డులోకి ట్రాయ్‌ మాజీ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ

ABN , Publish Date - Jan 09 , 2024 | 03:02 AM

తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ బోర్డులో ట్రాయ్‌ మాజీ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మకు స్థానం లభించింది. దీంతో కంపెనీ బోర్డులో మొత్తం డైరెక్టర్ల సంఖ్య ఏడుకు చేరుతుందని...

తాన్లా బోర్డులోకి  ట్రాయ్‌ మాజీ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ బోర్డులో ట్రాయ్‌ మాజీ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మకు స్థానం లభించింది. దీంతో కంపెనీ బోర్డులో మొత్తం డైరెక్టర్ల సంఖ్య ఏడుకు చేరుతుందని తాన్లా వ్యవస్థాపక చైర్మన్‌, సీఈఓ ఉదయ్‌ రెడ్డి తెలిపారు. భారత డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ప్రయాణంలో శర్మ కీలక పాత్ర పోషించారు. డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో ఆయనకు దాదాపు ఐదు దశాబ్దాల అనుభవం ఉంది. 2015 నుంచి 2020 వరకూ టెలికామ్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌)కు ఆర్‌ఎస్‌ శర్మ చైర్మన్‌గా సేవలు అందిం చారు. 1978 నుంచి ఐఏఎస్‌ అధికారిగా పని చేశారు. శర్మ వంటి విశేష అనుభవం ఉన్న వ్యక్తి తాన్లా బోర్డులో చేరడంతో ఆయనకు ఉన్న అపార అనుభవం కంపెనీ విజయానికి బాగా ఉపయోగ పడుతుందని ఉదయ్‌ రెడ్డి అన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 03:02 AM