Share News

ఎలకా్ట్రనిక్స్‌ రంగంలో విదేశీ భాగస్వామ్యాలు

ABN , Publish Date - Jan 07 , 2024 | 03:25 AM

వచ్చే ఐదేళ్లలో ఎలకా్ట్రనిక్స్‌ తయారీకి భారత్‌ పెద్ద కేంద్రం కానుంది. ఇప్పటి వరకూ లో-ఎండ్‌ డివైసె్‌సను తయారు చేస్తున్న దేశీయ ఎలకా్ట్రనిక్స్‌ పరిశ్రమ హైటెక్‌ వస్తువుల తయారీలోకి...

ఎలకా్ట్రనిక్స్‌ రంగంలో విదేశీ భాగస్వామ్యాలు

భారత కంపెనీల చేతికి తయారీ యూనిట్లు

గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న ఎలకా్ట్రనిక్స్‌ వినియోగం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వచ్చే ఐదేళ్లలో ఎలకా్ట్రనిక్స్‌ తయారీకి భారత్‌ పెద్ద కేంద్రం కానుంది. ఇప్పటి వరకూ లో-ఎండ్‌ డివైసె్‌సను తయారు చేస్తున్న దేశీయ ఎలకా్ట్రనిక్స్‌ పరిశ్రమ హైటెక్‌ వస్తువుల తయారీలోకి అడుగు పెట్టనుంది. ఇందుకు విదేశీ కంపెనీలతో చేతులు కలుపుతోంది. దీనివల్ల ఎలకా్ట్రనిక్స్‌ టెక్నాలజీ రంగంలో దేశీయ కంపెనీలకు నైపుణ్యాలు పెరగడమే కాక విదేశీ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం కూడా వచ్చే వీలుందని మాస్‌చిప్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి దేశీయ కంపెనీలు విదేశీ కంపెనీల తయారీ యూనిట్లను కొనుగోలు చేస్తున్నాయి. భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. యాపిల్‌ టెక్నాలజీని పొందడానికి భారత్‌లో ఐఫోన్‌ను తయారు చేస్తున్న తైవాన్‌ కంపెనీ విస్ట్రాన్‌ యూనిట్‌ను టాటా టెక్నాలజీస్‌ సొంతం చేసుకుంది. చైనాకు చెందిన షామీతో డిక్సన్‌ టెక్నాలజీస్‌ చేతులు కలిపింది. ల్యాప్‌టా్‌పలను తయారు చేయడానికి ఇంటెల్‌తో కేనీస్‌ టెక్నాలజీస్‌ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.

18 శాతం వృద్ధి అంచనా..

రానున్న ఐదేళ్లలో దేశీయ ఎలకా్ట్రనిక్స్‌ పరిశ్రమ ఏడాదికి 18 శాతం వృద్ధి చెందగలదని అంచనా. మొత్తం ఎలకా్ట్రనిక్‌ సిస్టమ్‌ డిజైన్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌ (ఈఎ్‌సడీఎం) పరిశ్రమను తీసుకుంటే ఈ వృద్ధి రేటు 32 శాతం ఉండొచ్చని భావిస్తున్నాయి. భారత్‌లో గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఎలకా్ట్రనిక్స్‌ పరికరాలు, ఉపకరణాల వాడకం పెరగడం ఇందుకు కారణం. 2023 తొలి త్రైమాసికంలో దేశంలో విక్రయించిన స్మార్ట్‌ ఫోన్లలో 37.2 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే విక్రయం అయ్యాయి. ఫ్రిజ్‌, వాషింగ్‌ మిషన్ల వంటి అన్ని గృహోపకరణాలు స్మార్ట్‌ డివైసె్‌సగా మారుతున్నాయి. దేశీయ ఈఎ్‌సడీఎం పరిశ్రమ విలువ ప్రస్తుతం 3,400 కోట్ల బిలియన్‌ డాలర్ల (రూ.2.78 లక్షల కోట్లు) మేరకు ఉందని ఇది 2026 నాటికి 8000 కోట్ల డాలర్లకు చేరగలదని అంచనా వేస్తున్నారు. ఇందుకు ఆటోమోటివ్‌, ఏరోస్పేస్‌, రక్షణ, మెడికల్‌ డివైసె్‌సలు దోహదం చేయనున్నాయి. సాధారణ ద్విచక్ర వాహనంతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనంలో 9 రెట్లు అధికంగా ఎలక్ట్రిక్‌ కాంపొనెంట్లు ఉంటాయి. మరోవైపు ఎలకా్ట్రనిక్స్‌ పరిశ్రమ అభివృద్ధికి స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్లు ఏర్పాటు, ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహాకాల పథకం వంటి విధానపరమైన నిర్ణయాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలకా్ట్రనిక్స్‌ పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాయి.

Updated Date - Jan 07 , 2024 | 03:25 AM