Share News

ఈ ఆర్థిక సంవత్సరానికి

ABN , Publish Date - May 26 , 2024 | 05:03 AM

పన్ను చెల్లింపుదారులు స్థిరాస్తి, సెక్యూరిటీలు, ఆభరణాల విక్రయం ద్వారా లభించే దీర్ఘకాల మూలధన లాభాలను లెక్కించేందుకు ఆదాయం పన్ను (ఐటీ) శాఖ...

ఈ ఆర్థిక సంవత్సరానికి

ధర ద్రవ్యోల్బణ సూచీ విడుదల

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు స్థిరాస్తి, సెక్యూరిటీలు, ఆభరణాల విక్రయం ద్వారా లభించే దీర్ఘకాల మూలధన లాభాలను లెక్కించేందుకు ఆదాయం పన్ను (ఐటీ) శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) గాను ధర ద్రవ్యోల్బణ సూచీ(సీఐఐ)ని ప్రకటించింది. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సీఐఐ 363గా ఉంది. 2023-24లో సూచీ 348గా, 2022-23లో 331గా నమోదైంది. 2023-24తో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరానికి సూచీ 15 పాయింట్లు పెరిగింది. ఇది సుమారు 4.3 శాతం వార్షిక ద్రవ్యోల్బణ రేటుకు సమానం.

Updated Date - May 26 , 2024 | 05:03 AM