Share News

ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు

ABN , Publish Date - Jul 08 , 2024 | 06:19 AM

గ్రామీణ మార్కెట్లో ఏర్పడిన పునరుజ్జీవంతో ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో తాము ఏక అంకె వృద్ధిని నమోదు చేయగలమని, మార్జిన్లు కూ డా విస్తరించే ఆస్కారం ఉన్నదని...

ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు

గ్రామీణ డిమాండ్‌ పుంజుకుంటోంది

న్యూఢిల్లీ: గ్రామీణ మార్కెట్లో ఏర్పడిన పునరుజ్జీవంతో ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో తాము ఏక అంకె వృద్ధిని నమోదు చేయగలమని, మార్జిన్లు కూ డా విస్తరించే ఆస్కారం ఉన్నదని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు అంటున్నాయి. దీనికి తోడు అర్బన్‌ మార్కెట్లో స్థిరత్వం కూడా సానుకూల అంశమని చెబుతున్నాయి. దేశంలో వస్తువులకు డిమాండ్‌ క్రమంగా మెరుగుపడుతోందని, ఇది ఆశించిన స్థాయిలోనే ఉన్నదని డాబర్‌, మారికో, అదానీ విల్మర్‌ అంటున్నాయి. ‘‘ఈ త్రైమాసికంలో ధరలు సాధారణంగా స్థిరంగా ఉన్నాయి. అయితే గతంలో అమలుపరిచిన ధరల పెంపు, వ్యయ నియంత్రణ విధానాల సహాయంతో స్థూల మార్జిన్లు పెరగవచ్చు’’ అని డాబర్‌ చెబుతోంది. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగా ఉంటాయన్న అంచనాలతో పాటు స్థూల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యంతో రాబోయే రోజుల్లో గ్రామీణ డిమాండ్‌ మరింత పెరగవచ్చని పేర్కొంది

Updated Date - Jul 08 , 2024 | 06:19 AM