Share News

హైదరాబాద్‌లో ఫ్లట్టర్‌ గ్లోబల్‌ కెపాసిటీ సెంటర్‌

ABN , Publish Date - Aug 21 , 2024 | 05:27 AM

ఆన్‌లైన్‌ క్రీడల బెట్టింగ్‌, ఐ గేమింగ్‌ కంపెనీ ఫ్లట్టర్‌ ఇండియా మంగళవారం హైదరాబాద్‌లో కొత్త గ్లోబల్‌ కెపాసిటీ సెంటర్‌ (జీసీసీ) ప్రారంభించింది...

హైదరాబాద్‌లో ఫ్లట్టర్‌ గ్లోబల్‌ కెపాసిటీ సెంటర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆన్‌లైన్‌ క్రీడల బెట్టింగ్‌, ఐ గేమింగ్‌ కంపెనీ ఫ్లట్టర్‌ ఇండియా మంగళవారం హైదరాబాద్‌లో కొత్త గ్లోబల్‌ కెపాసిటీ సెంటర్‌ (జీసీసీ) ప్రారంభించింది. 35 లక్షల డాలర్ల (రూ.29 కోట్లు) వ్యయంతో దీన్ని ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌లో ఇప్పటికే 700 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. సృజనాత్మకతను ప్రోత్సహించడం, భారత ఉపాధి, నైపుణ్యాల మార్కెట్లో తమ అస్తిత్వాన్ని శక్తివంతం చేసుకోవడం, వృద్ధి సాధన ఈ సెంటర్‌ ఏర్పాటు చేయడం వెనుక లక్ష్యాలని ఫ్లట్టర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఓఓ ఫిల్‌ బిషప్‌ తెలిపారు. డేటా అనలిటిక్స్‌, ఇంజనీరింగ్‌ విభాగాల్లో నియామకాలు చేపట్టాలనుకుంటున్నామని, ఈ ఏడాది చివరికి ఉద్యోగుల సంఖ్య 900కి పెంచాలన్నది తమ లక్ష్యమని చెప్పారు.

Updated Date - Aug 21 , 2024 | 05:27 AM