Share News

తెలుగు రాష్ర్టాల్లో యారీ రైడర్‌ యాప్‌ విస్తరణ

ABN , Publish Date - Feb 29 , 2024 | 04:41 AM

ఓపెన్‌ నెట్‌వర్క్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ) ఆధారిత ‘యారీ’ రైడర్‌ యాప్‌ తన సేవలను మరింత విస్తరిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌కే పరిమితమైన ఈ యాప్‌ ఏప్రిల్‌ నెలాఖరుకల్లా...

తెలుగు రాష్ర్టాల్లో  యారీ రైడర్‌ యాప్‌ విస్తరణ

హైదరాబాద్‌: ఓపెన్‌ నెట్‌వర్క్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ) ఆధారిత ‘యారీ’ రైడర్‌ యాప్‌ తన సేవలను మరింత విస్తరిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌కే పరిమితమైన ఈ యాప్‌ ఏప్రిల్‌ నెలాఖరుకల్లా తన సేవలను వరంగల్‌, విజయవాడ, తిరుపతి, వైజాగ్‌లకు విస్తరించనుంది. ఈ యాప్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ (సీబీఓ) పారితోష్‌ వర్మ ఈ విషయం వెల్లడించారు. రోజుకు రూ.25 కమిషన్‌తో ఆటో డ్రైవర్లు ఎవరైనా తమ రైడింగ్‌ యాప్‌లో చేరవచ్చన్నారు. క్యాబ్‌లకు సంబంధించి రోజువారీ కమిషన్‌ను ఇంకా ఖరారు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 30,000 ఆటో రిక్షాలు, మూడు వేల క్యాబ్‌లు ‘యారీ’ యాప్‌ ద్వారా సేవలు అందిస్తున్నాయి. వచ్చే నెలాఖరుకల్లా ఈ సంఖ్యను 50 వేల ఆటో రిక్షాలు, 10 వేల క్యాబ్‌లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వర్మ తెలిపారు

Updated Date - Feb 29 , 2024 | 04:41 AM