Share News

మెడ్‌ట్రానిక్‌ ఎంఈఐసీ సెంటర్‌ విస్తరణ

ABN , Publish Date - Mar 01 , 2024 | 06:03 AM

మెడికల్‌ టెక్నాలజీలో అంతర్జాతీయంగా పేరున్న మెడ్‌ట్రానిక్‌.. హైదరాబాద్‌లోని తన ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (ఎంఈఐసీ)ను మరింత విస్తరించింది...

మెడ్‌ట్రానిక్‌ ఎంఈఐసీ సెంటర్‌ విస్తరణ

రూ.3,000 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్‌: మెడికల్‌ టెక్నాలజీలో అంతర్జాతీయంగా పేరున్న మెడ్‌ట్రానిక్‌.. హైదరాబాద్‌లోని తన ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (ఎంఈఐసీ)ను మరింత విస్తరించింది. 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కేంద్రాన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి డీ శ్రీధర్‌ బాబు గురువారం ప్రారంభించారు. ఈ విస్తరణ కేంద్రం కోసం మెడ్‌ట్రానిక్‌ సంస్థ రూ.3,000 కోట్లు ఖర్చు చేసింది. అమెరికా వెలుపల కంపెనీకి ఇదే అతిపెద్ద ఆర్‌ అండ్‌ డీ కేంద్రం. ప్రస్తుతం 900 మందికి పైగా ఉన్న ఉద్యోగుల సంఖ్యను భవష్యత్‌లో 1,500కు పెంచనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమంలో మెడ్‌ట్రానిక్‌ చైర్మన్‌, సీఈఓ జియోఫ్‌ మార్తా, అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 06:58 AM