స్వల్ప లాభాలతోనే సరి
ABN , Publish Date - Jan 12 , 2024 | 05:45 AM
కార్పొరేట్ ఫలితాలు, దేశీయ ఆర్థిక గణాంకాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు నిరాసక్తత చూపించటం తో స్టాక్ మార్కెట్...

సెన్సెక్స్ 63 పాయింట్లు అప్
ముంబై: కార్పొరేట్ ఫలితాలు, దేశీయ ఆర్థిక గణాంకాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు నిరాసక్తత చూపించటం తో స్టాక్ మార్కెట్ పరిమిత లాభాలతోనే సరిపెట్టుకుంది. సెన్సెక్స్ ఒక దశలో 342 పాయింట్లు లాభపడినప్పటికీ చివరికి 63.47 పాయింట్లకే ఆ లాభాన్ని పరిమితం చేసుకుని 71,721.18 వద్ద ముగిసింది. నిఫ్టీ 28.50 పాయింట్ల లాభం తో 21,647.20 వద్ద క్లోజైంది. బీఎ్‌సఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు లాభాలతో ముగిశాయి.
కుప్పకూలిన పాలీక్యాబ్ షేరు: విద్యుత్ ఉపకరణాల తయారీలోని పాలీక్యాబ్ షేరు గురువారం ఏకంగా 21 శాతం పడిపోయాయి. మార్కెట్ విలువ రూ.15,485.96 కోట్లు తుడిచిపెట్టుకుపోయి రూ.58,225.57 కోట్లకు పడిపోయింది. ఇటీవల ఈ కంపెనీపై నిర్వహించిన సోదాల్లో రూ.1,000 కోట్ల విలువ గల ‘‘లెక్కల్లో చూపని విక్రయాల’’ను గుర్తించినట్టు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించడం ఇందుకు కారణం. బీఎ్‌సఈలో ఈ షేరు 21.08 ు నష్టంతో రూ.3,877.40 వద్ద ముగియగా ఎన్‌ఎ్‌సఈలో 20.50 ు మేరకు దిగజారి రూ.3,904.70 వద్ద ముగిసింది.