వడ్డీ రేట్లు తగ్గించిన ఈసీబీ
ABN , Publish Date - Jun 07 , 2024 | 04:32 AM
యూరోపియన్ కేంద్ర బ్యాంక్ (ఈసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేటును 4 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గించింది. 2019 తర్వాత ఈసీబీ వడ్డీ రేట్లు తగ్గించడం...

ఫ్రాంక్‌ఫర్ట్ (జర్మనీ): యూరోపియన్ కేంద్ర బ్యాంక్ (ఈసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేటును 4 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గించింది. 2019 తర్వాత ఈసీబీ వడ్డీ రేట్లు తగ్గించడం ఇదే మొదటిసారి. వడ్డీ రేట్లు తగ్గించాలా? వద్దా? అని అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్‌తో సహా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు తర్జనభర్జనలు పడుతున్న సమయంలో ఈసీబీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా శుక్రవారం నాడు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తన ద్రవ్య పరపతి విధాన సమీక్ష వివరాలను వెల్లడించనుంది.