మరింత సులభంగా రైట్స్ ఇష్యూలు!
ABN , Publish Date - Aug 21 , 2024 | 05:29 AM
నిధుల సమీకరణ కోసం కంపెనీలు జారీ చేసే రైట్స్ ఇష్యూలను మరింత సులభతరం చేయాలని మార్కెట్ నియంత్రణ మండలి సెబీ భావిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలతో...
న్యూఢిల్లీ: నిధుల సమీకరణ కోసం కంపెనీలు జారీ చేసే రైట్స్ ఇష్యూలను మరింత సులభతరం చేయాలని మార్కెట్ నియంత్రణ మండలి సెబీ భావిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలతో ఒక చర్చాపత్రం విడుదల చేసింది. సంబంధిత పార్టీలన్నీ ఈ ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను వచ్చే నెల 10వ తేదీలోగా తనకు పంపాలని కోరింది. సెబీ ప్రతిపాదనలు ఇవే..
రైట్స్ ఇష్యూల్లో మర్చంట్ బ్యాంకర్ల అవసరాన్ని తొలగించి ఆ బాధ్యతను రిజిస్ట్రార్లు లేదా స్టాక్ ఎక్స్చేంజీలకు అప్పగించడం
రైట్స్ ఇష్యూల ద్వారా సమీకరించిన నిధుల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ ఏజెన్సీ ఏర్పాటు
రైట్స్ ఇష్యూ సమయానికి ఆ కంపెనీ షేర్ల ట్రేడింగ్‌పై నిషేధం ఉంటే రైట్స్ ఇష్యూని అనుమతించకూడదు.
లెటర్ ఆఫ్ ఆఫర్‌లో రైట్స్ ఇష్యూకి సంబంధించిన వివరాలు మాత్రమే వెల్లడించేలా నిబంధనల హేతుబద్దీకరణ
కంపెనీల బోర్డు ఆమోదించిన తర్వాత రైట్స్ ఇష్యూల గడువును టీ+20 వర్కింగ్ డేస్‌కు కుదించడం
రైట్స్ ఇష్యూకి వచ్చిన దరఖాస్తుల వ్యాలిడిటీ, షేర్ల కేటాయింపు ప్రాతిపదికను నిర్ణయించే విషయం రిజిస్ట్రార్లతో పాటు స్టాక్ ఎక్స్చేంజీలు, డిపాజిటరీ సంస్థలకు అప్పగించడం సెబీ ప్రతిపాదన