Share News

లాట్‌ మొబైల్స్‌లో దసరా, దీపావళి ఆఫర్లు

ABN , Publish Date - Oct 08 , 2024 | 01:43 AM

మొబైల్‌ రిటైల్‌ చెయిన్‌ లాట్‌ మొబైల్స్‌.. తన 12వ వార్షికోత్సవంతో పాటు దసరా, దీపావళి పండగల సందర్భంగా ‘సెలబ్రేట్‌ విత్‌ లాట్‌’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇంతకుముందు ఎన్నడు లేని విధంగా...

లాట్‌ మొబైల్స్‌లో దసరా, దీపావళి ఆఫర్లు

హైదరాబాద్‌: మొబైల్‌ రిటైల్‌ చెయిన్‌ లాట్‌ మొబైల్స్‌.. తన 12వ వార్షికోత్సవంతో పాటు దసరా, దీపావళి పండగల సందర్భంగా ‘సెలబ్రేట్‌ విత్‌ లాట్‌’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇంతకుముందు ఎన్నడు లేని విధంగా స్మార్ట్‌ ఫోన్లు, స్మార్ట్‌ టీవీలు, ల్యాప్‌టాప్స్‌, ఎలకా్ట్రనిక్స్‌ డ్యూరబుల్స్‌పై పలు ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు లాట్‌ మొబైల్స్‌ డైరెక్టర్‌ ఎం అఖిల్‌ వెల్లడించారు. ఇందులో భాగంగా రూ.9,999 వరకు విలువ చేసే ప్రతి కొనుగోలుపై కచ్చితమైన బహుమతులతో పాటు స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ టీవీలు, ఏసీలు, ల్యాప్‌టా్‌ప్సపై 40 శాతం తక్షణ తగ్గింపు సహా 10 శాతం నగదు వాపసు ఆఫర్‌ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి ఒప్పో మొబైల్‌ కొనుగోలుపై లక్కీ డ్రా ద్వారా రూ.10 లక్షల వరకు నగదు గెలుచుకునే అవకాశంతో పాటు నో కాస్ట్‌ ఈఎంఐ ఫైనాన్స్‌ పథకాలు, బ్రాండెడ్‌ యాక్సెసరీ్‌సపై 80 శాతం వరకు తగ్గింపును ఇస్తున్నట్లు తెలిపారు.


ఈఎంఐ ఆఫర్‌గా ఏటీఎం కార్డు నుంచి రూ.1 ముందస్తు చెల్లింపు ద్వారా స్మార్ట్‌ఫోన్స్‌, టీవీలు, ఏసీలు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు లాట్‌ మొబైల్స్‌ డైరెక్టర్‌ ఎం సుప్రజ తెలిపారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ కన్నా మెరుగైన ధరలు, డిస్కౌంట్స్‌ లాట్‌ మొబైల్‌ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.

Updated Date - Oct 08 , 2024 | 01:43 AM