Share News

Range Rover : ఇక దేశీయంగా రేంజ్‌ రోవర్‌ కార్ల తయారీ

ABN , Publish Date - May 25 , 2024 | 05:56 AM

టాటా మోటార్స్‌ యాజమాన్యంలోని జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌).. రేంజ్‌ రోవర్‌, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్స్‌ కార్లను దేశంలోనే ఉత్పత్తి చేయనుంది. 54 సంవత్సరాల చరిత్రలో

Range Rover : ఇక దేశీయంగా రేంజ్‌ రోవర్‌ కార్ల తయారీ

22% తగ్గనున్న ధరలు

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ యాజమాన్యంలోని జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌).. రేంజ్‌ రోవర్‌, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్స్‌ కార్లను దేశంలోనే ఉత్పత్తి చేయనుంది. 54 సంవత్సరాల చరిత్రలో జేఎల్‌ఆర్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వెలుపల కార్లు తయారుచేయడం ఇదే ప్రథమం. ఇప్పటివరకు రేంజ్‌ రోవర్‌ కార్లను యూకేలోని సోలిహల్‌ ప్లాంట్‌లో తయారుచేసి ప్రపంచంలోని 121 మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు. భారత్‌లోనే ఈ కార్లను ఉత్పత్తి చేయడం వల్ల వీటి ధర కూడా 18 నుంచి 22 శాతం తగ్గి మరింత ఎక్కువ మంది కస్టమర్లకు చేరుకోగలుగుతాయని టాటా గ్రూప్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ అన్నారు. భారత మార్కెట్‌పై తమకు గల నమ్మకానికి ఈ నిర్ణయం ప్రతీక అని ఆయన వ్యాఖ్యానించారు. స్థానికంగానే కార్లను అసెంబుల్‌ చేయడం వల్ల సుంకాల భారం తగ్గి ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించగలుగుతామని జేఎల్‌ఆర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజన్‌ అంబా అన్నారు.

Updated Date - May 25 , 2024 | 05:56 AM