Share News

ICICI Bank: మీకు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందా? ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ ఆఫర్లు వర్తిస్తాయ్!

ABN , Publish Date - Jan 05 , 2024 | 04:09 PM

మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? అయితే మీకు ఓ బిగ్ అలెర్ట్. ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తున్న ఈ 21 రకాల క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి మంచి ఆఫర్లు ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఆఫర్లు వర్తిస్తాయి.

ICICI Bank: మీకు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందా? ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ ఆఫర్లు వర్తిస్తాయ్!

మీరు ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? అయితే మీకు ఓ బిగ్ అలెర్ట్. ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తున్న ఈ 21 రకాల క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి మంచి ఆఫర్లు (Offers) ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఆఫర్లు వర్తిస్తాయి. మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నట్లయితే మీ కార్డు ఈ 21 కార్డుల జాబితాలో ఉందేమో చూసుకోండి. ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ (Airport Lounge access ) బెనిఫిట్స్‌తో పాటు, రివార్డ్ పాయింట్లను కూడా అందించనుంది (ICICI Bank credit card).

మీరు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒక త్రైమాసికంలో రూ.35 వేల ఖర్చు చేసినట్లయితే ఒక కాంప్లిమెంటరీ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. మీరు ఖర్చు చేసిన తర్వాతి త్రైమాసికంలో ఆ లాంజ్ యాక్సెస్ మీకు అందుబాటులోకి వస్తుంది. అలాగే డైనమిక్ కరెన్సీ కన్వర్సన్ (DCC) ఫీజును కూడా ఐసీఐసీఐ బ్యాంకు సవరించింది. ఫిబ్రవరి 1, 2024 నుంచి విదేశాల్లో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లు చేస్తే డైనమిక్ కరెన్సీ కన్వర్సన్ ఛార్జీలుగా 1 శాతం ప్లస్ ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ అన్ని రకాల ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు వర్తిస్తాయి.

అలాగే ఫిబ్రవరి 1, 2024 నుంచి రెంట్ పేమెంట్స్, ఇ-వాలెట్ లోడింగ్స్‌పై ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ఉండవు. ఇక, మీ కార్డు ద్వారా యుటిలిటీ పేమెంట్లు చేసినట్లయితే ప్రతి పేమెంట్‌పై రివార్డ్ పాయింట్లు వస్తాయి. ఇందులో ప్రభుత్వ ట్రాన్సాక్షన్లూ ఉంటాయి. ఈ రూల్స్ కూడా ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తాయి.

ఐసీఐసీఐ బ్యాంకు ఆఫర్లు ప్రకటించిన 21 క్రెడిట్ కార్డులు ఇవే..

ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ క్రెడిట్ కార్డు

ఐసీఐసీఐ బ్యాంక్ సెక్యూర్డ్ కోరల్ క్రెడిట్ కార్డు

ఐసీఐసీఐ బ్యాంక్ లీడ్ ద న్యూ కోరల్ క్రెడిట్ కార్డు

ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్‌ప్రెషన్స్ క్రెడిట్ కార్డు

ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్‌పీసీఎల్ సూపర్ సేవర్ వీసా క్రెడిట్ కార్డు

ఐసీఐసీఐ బ్యాంక్ మాంచెస్టర్ యూనైటెడ్ ప్లాటినమ్ క్రెడిట్ కార్డు

ఐసీఐసీఐ బ్యాంక్ పరాక్రమ్ సెలక్ట్ క్రెడిట్ కార్డు

ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ సెక్యూర్డ్ కోరల్ వీసా క్రెడిట్ కార్డు

ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డు

ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ రూపే క్రెడిట్ కార్డు

మైన్ క్రెడిట్ కార్డు బై ఐసీఐసీఐ బ్యాంక్ వీసా కార్డ్

ఐసీఐసీఐ బ్యాంక్ హెచ్‌పీసీఎల్ సూపర్ సేవర్ మాస్టర్ క్రెడిట్ కార్డు

చెన్నై సూపర్ కింగ్స్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు

ఐసీఐసీఐ బ్యాంక్ బిజినెస్ బ్లూ అడ్వాంటేజ్ కార్డు

ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు

ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ కోరల్ క్రెడిట్ కార్డు

ఐసీఐసీఐ బ్యాంక్ మాస్టర్ కార్డు కోరల్ క్రెడిట్ కార్డు

మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినమ్ క్రెడిట్ కార్డు

స్పీడ్‌జెడ్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు

ఐసీఐసీఐ బ్యాంక్ మేక్ మై ట్రిప్ మాస్టర్ కార్డ్ బిజినెస్ ప్లాటినమ్ క్రెడిట్ కార్డు

మైన్ క్రెడిట్ కార్డు బై ఐసీఐసీఐ బ్యాంక్ మాస్టర్ కార్డు

Updated Date - Jan 05 , 2024 | 04:09 PM