Share News

బీ న్యూలో దీపావళి ఆఫర్లు

ABN , Publish Date - Oct 26 , 2024 | 05:20 AM

మొబైల్స్‌ రిటైల్‌ సంస్థ బీ న్యూ మొబైల్స్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ దీపావళి పండగను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గడిచిన పదేళ్లుగా 70 లక్షల కంటే ఎక్కువ మొబైల్‌ వినియోగదారుల అభిమానం,

బీ న్యూలో దీపావళి ఆఫర్లు

హైదరాబాద్‌: మొబైల్స్‌ రిటైల్‌ సంస్థ బీ న్యూ మొబైల్స్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ దీపావళి పండగను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గడిచిన పదేళ్లుగా 70 లక్షల కంటే ఎక్కువ మొబైల్‌ వినియోగదారుల అభిమానం, ఆదరణ చూరగొన్న బీ న్యూ మొబైల్స్‌.. దీపావళి సందర్భంగా మొబైల్స్‌ సహా గృహాపరకరణాలపై అద్భుతమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చిందని సంస్థ సీఈఓ వై సాయి నిఖిలేష్‌ తెలిపారు. ఎంఐ, వివో, ఒప్పో, రియల్‌మీ, ఐఫోన్‌, ఐటెల్‌, సామ్‌సంగ్‌ మొబైల్స్‌ కొనుగోలుపై కచ్చితమైన బహుమతిని అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే లక్కీ డ్రాలో కారు, బైక్‌, రూ.10 లక్షల నగదు గెలుచుకునే అవకాశం ఉందన్నారు. ల్యాప్‌టా్‌పలపై రూ.10,000, టీవీలపై రూ.7,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు నిఖిలేష్‌ తెలపారు. యాక్సెసరీ్‌సపై 80 శాతం వరకు డిస్కౌంట్‌ సహా ఎంపిక చేసిన మొబైల్స్‌పై 50 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇస్తున్నట్లు చెప్పారు. ఐఫోన్‌ కొనుగోలుపై భారీ డిస్కౌంట్‌తో పాటు రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎలాంటి సిబిల్‌ స్కోరుతో సంబంధం లేకుండా ఆధార్‌ కార్డు, పాన్‌కార్డులతో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ద్వారా మొబైల్‌, టీవీ, ల్యాప్‌టా్‌ప్సను జీరో డౌన్‌ పేమెంట్‌, జీరో వడ్డీతో కొనుగోలు చేయవచ్చన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 150కి పైగా బీ న్యూ షోరూమ్స్‌ల్లో దీపావళి ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయని నిఖిలేష్‌ వెల్లడించారు.

Updated Date - Oct 26 , 2024 | 05:20 AM