Share News

ఆర్‌బీఐ, పీఎ్‌సబీల నుంచి డివిడెండ్‌ ఆదాయం రూ.1.02 లక్షల కోట్లు

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:15 AM

వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ (పీఎ్‌సబీ)ల నుంచి డివిడెండ్ల రూపంలో రూ.1.02 లక్షల కోట్ల ఆదాయం సమకూరవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది...

ఆర్‌బీఐ, పీఎ్‌సబీల నుంచి  డివిడెండ్‌ ఆదాయం రూ.1.02 లక్షల కోట్లు

2023-24లో రూ.1.04 లక్షల కోట్లు

వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ (పీఎ్‌సబీ)ల నుంచి డివిడెండ్ల రూపంలో రూ.1.02 లక్షల కోట్ల ఆదాయం సమకూరవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో డివిడెండ్‌ రాబడి రూ.1.04 లక్షల కోట్లకు చేరుకోవచ్చని భావిస్తోంది. 2023-24 బడ్జెట్‌ అంచనా రూ.48,000 కోట్లతో పోలిస్తే రెండింతలకు పైగా అధికమిది. గత ఏడాది మేలో ఆర్‌బీఐ ప్రభుత్వానికి ఏకంగా రూ.87,416 కోట్ల డివిడెండ్‌ చెల్లించడం ఇందుకు దోహదపడింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఆర్‌బీఐ, పీఎ్‌సబీల నుంచి డివిడెండ్ల రూపంలో కేంద్రానికి కేవలం రూ.39,961 కోట్లే సమకూరాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎ్‌సఈ)ల నుంచి రూ.43,000 కోట్ల డివిడెండ్‌ చెల్లింపులను అంచనా వేయగా.. రూ.50,000 కోట్ల వరకు సమకూరనున్నాయి. దాంతో 2023-24లో ఆర్‌బీఐ, పీఎ్‌సబీలు, సీపీఎ్‌సఈల నుంచి డివిడెండ్‌ ఆదాయం రూ.1,54,407 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

సీపీఎ్‌సఈల డివిడెండ్‌తో కలిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం రాబడి రూ.1.50 లక్షల కోట్ల కోట్లకు చేరుకోవచ్చని బడ్జెట్‌లో అంచనా వేసింది. పన్ను వసూళ్లు గణనీయంగా పెరగడంతోపాటు డివిడెండ్‌ ఆదాయంలో భారీ వృద్ధి కేంద్ర ద్రవ్యలోటు లక్ష్యాలను చేరుకునేందుకు దోహదడనుంది.

Updated Date - Feb 02 , 2024 | 03:15 AM