Share News

చిన్న నగరాల్లో ప్రీమియం కార్లకు డిమాండ్‌

ABN , Publish Date - Mar 25 , 2024 | 04:11 AM

దేశంలోని మెట్రో నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో పెర్ఫార్మెన్స్‌ ఆధారంగా నడిచే ప్రీమియం కార్లకు పెరిగిన ఆదరణను సొమ్ము చేసుకోవాలని ఫోక్స్‌వేగన్‌ భావిస్తోంది...

చిన్న నగరాల్లో  ప్రీమియం కార్లకు డిమాండ్‌

ఫోక్స్‌వ్యాగన్‌ ఇండియా డైరెక్టర్‌ ఆశిష్‌ గుప్తా

జైపూర్‌: దేశంలోని మెట్రో నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో పెర్ఫార్మెన్స్‌ ఆధారంగా నడిచే ప్రీమియం కార్లకు పెరిగిన ఆదరణను సొమ్ము చేసుకోవాలని ఫోక్స్‌వేగన్‌ భావిస్తోంది. ఈ ఏడాది ఈ విభాగంలో అమ్మకాలు 15 శాతం పెరుగుతాయని అంచనా వేస్తోంది. గత ఏడాది కంపెనీ దేశీయ మార్కెట్లో 44,000 కార్లు విక్రయించింది. భారత మార్కెట్లో కంపెనీ విక్రయిస్తున్న కార్లలో ప్రీమియం పెర్ఫార్మెన్స్‌ విభాగానికి చెందిన ఎస్‌యూవీ టైగన్‌, సెడాన్‌ కారు వర్టస్‌ 1.5 పెట్రోల్‌ ఇంజన్‌ ‘జీటీ’ ట్రిమ్‌ కార్లున్నాయి. అయితే ఇదే జీటీ విభాగంలో అందుబాటు ధరల్లో కార్లు తీసుకురావాలన్న కస్టమర్ల కోరికను పరిగణనలోకి తీసుకుని ఈ రెండింటిలోనూ ఒక లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో ‘జీటీ లైన్‌’ వెర్షన్లు అందుబాటులోకి తెచ్చినట్టు ఫోక్స్‌వేగన్‌ ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ ఆశిష్‌ గుప్తా తెలిపారు. తమ మొత్తం కార్ల విక్రయాల్లో 20 నుంచి 25 శాతం జీటీ వెర్షన్లేనని గుప్తా చెప్పారు.

Updated Date - Mar 25 , 2024 | 04:11 AM