Share News

కాగ్నిజెంట్‌లో జీతాల పెంపు వాయిదా

ABN , Publish Date - Apr 07 , 2024 | 03:58 AM

నాస్‌డాక్‌ లిస్టెడ్‌ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ ఉద్యోగుల జీతాల పెంపును నాలుగు నెలలు వాయిదా వేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో వేతన పెంపును అమలు చేసిన కంపెనీ.. ఈసారి మాత్రం ఆగస్టులో పెంచనున్నట్లు తెలిపింది...

కాగ్నిజెంట్‌లో జీతాల పెంపు వాయిదా

ఏప్రిల్‌కు బదులు ఆగస్టులో హైక్‌

న్యూఢిల్లీ: నాస్‌డాక్‌ లిస్టెడ్‌ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ ఉద్యోగుల జీతాల పెంపును నాలుగు నెలలు వాయిదా వేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో వేతన పెంపును అమలు చేసిన కంపెనీ.. ఈసారి మాత్రం ఆగస్టులో పెంచనున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక మందగమనంతో ఐటీ సేవలకు డిమాండ్‌ తగ్గిన నేపథ్యంలో ఈ రంగ కంపెనీలు తమ లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు వీలైనన్ని మార్గాల్లో వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. కాగ్నిజెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా 3.47 లక్షల మంది ఉద్యోగులుండగా, అందులో 2.54 లక్షల మంది కంపెనీకి చెందిన భారత కార్యాలయాల్లోనే పనిచేస్తున్నారు.

Updated Date - Apr 07 , 2024 | 03:58 AM