Share News

సీయూబీ @రూ.లక్ష కోట్లు

ABN , Publish Date - May 22 , 2024 | 05:29 AM

ప్రైవేట్‌ రంగంలోని సిటీ యూనియన్‌ బ్యాంక్‌ (సీయూబీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండు కీలకమైన మైలురాళ్లను అధిగమించింది. ఏడాదిలో రూ.లక్ష కోట వ్యాపారాన్ని...

సీయూబీ @రూ.లక్ష కోట్లు

చెన్నై: ప్రైవేట్‌ రంగంలోని సిటీ యూనియన్‌ బ్యాంక్‌ (సీయూబీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండు కీలకమైన మైలురాళ్లను అధిగమించింది. ఏడాదిలో రూ.లక్ష కోట వ్యాపారాన్ని దాటడం ఒకటైతే రూ.1,000 కోట్ల నికర లాభం మైలురాయి మరొకటి. బ్యాంక్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ ఎన్‌.కామకోడి ఈ విషయం వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఆదాయం 6 శాతం పెరిగి రూ.1,02,138 కోట్లకు చేరగా నికరలాభం కూడా 6 శాతం వృద్ధితో రూ.1,016 కోట్లుగా నమోదైందన్నారు. మార్చి 31 నాటికి మొత్తం డిపాజిట్లు రూ.55,567 కోట్లుగాను, రుణాలు రూ.46,418 కోట్లుగాను ఉన్నాయి. నాలుగో త్రైమాసికంలో ఆస్తులపై రాబడి 1.48 శాతంగా ఉన్నదని ఆయన చెప్పారు. అలాగే పారుబాకీలకు కేటాయింపులు కూడా గణనీయంగా తగ్గాయని, కొవిడ్‌ ముందు నాటి స్థాయికి తగ్గించుకునే దిశగా ముందుకు సాగుతున్నామని కామకోడి తెలిపారు. బీమా విభాగంలో మంచి వృద్ధిని తాము ఆశిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

Updated Date - May 22 , 2024 | 05:29 AM