Share News

గాయత్రీ ప్రాజెక్ట్స్‌ లిక్విడేషన్‌కు రుణదాతల మొగ్గు!

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:47 AM

గాయత్రీ ప్రాజెక్ట్స్‌ను విక్రయించే ప్రక్రియ చేపట్టాలని కంపెనీకి రుణాలు ఇచ్చిన రుణదాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా రూ.650 కోట్లకు గాయత్రీ ప్రాజెక్ట్స్‌ను...

గాయత్రీ ప్రాజెక్ట్స్‌  లిక్విడేషన్‌కు రుణదాతల మొగ్గు!

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గాయత్రీ ప్రాజెక్ట్స్‌ను విక్రయించే ప్రక్రియ చేపట్టాలని కంపెనీకి రుణాలు ఇచ్చిన రుణదాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా రూ.650 కోట్లకు గాయత్రీ ప్రాజెక్ట్స్‌ను సొంతం చేసుకోవడానికి మార్క్‌ ఏబీ క్యాపిటల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఎల్‌ఎల్‌ఎల్‌సీ ముందుకు వచ్చిందని మార్కె ట్‌ వర్గాల కథనం. ఇందులో భాగంగా ముందుగా రూ.50 కోట్లను చెల్లించడానికి అంగీకరించింది. దివాలా పరిష్కార ప్రక్రియలో మార్క్‌ ఏబీ క్యాపిటల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ మాత్రమే తుది బిడ్‌ దాఖలు చేసినట్లు సమాచారం. మార్క్‌ ఏబీ క్యాపిటల్‌ ఆఫర్‌ చేసిన విలువ చాలా తక్కువని రుణదాతలు భావించి.. దాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 60 శాతానికి పైగా రుణదాతలు కంపెనీ లిక్విడేషన్‌కు మొగ్గు చూపినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. లిక్విడేషన్‌కు రిసొల్యూషన్‌ ప్రొఫెషనల్‌ ఇప్పటికే పిటిషన్‌ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాల సమాచారం. కాగా కంపెనీ ప్రమోటర్లు ఇన్‌సాల్వెన్సీ ప్రాసె్‌సను నిలిపివేయాలని ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది ఇంకా విచారణకు రావాల్సి ఉంది. రుణదాతలకు గాయత్రీ ప్రాజెక్ట్స్‌ రూ.9,000 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ఇందులో బ్యాంకులకు రూ.7,147 కోట్లు చెల్లించాలి.

Updated Date - Jan 12 , 2024 | 05:47 AM