Share News

‘దక్ష’లో కోరమాండల్‌కు మరింత వాటా

ABN , Publish Date - May 14 , 2024 | 05:40 AM

చెన్నై కేంద్రంగా పని చేసే దక్ష అన్‌మ్యాన్‌డ్‌ సిస్టమ్స్‌ (డీయూఎ్‌స)లో కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ మరింత వాటా కొనుగోలు చేసింది. రూ.150 కోట్లతో డీయూఎస్‌ ఈక్విటీలో...

‘దక్ష’లో కోరమాండల్‌కు మరింత వాటా

హైదరాబాద్‌: చెన్నై కేంద్రంగా పని చేసే దక్ష అన్‌మ్యాన్‌డ్‌ సిస్టమ్స్‌ (డీయూఎ్‌స)లో కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ మరింత వాటా కొనుగోలు చేసింది. రూ.150 కోట్లతో డీయూఎస్‌ ఈక్విటీలో మరో 7 శాతం వాటా కొనుగోలు చేసింది. దీంతో డీయూఎస్‌ ఈక్విటీలో కోరమాండల్‌ వాటా 51 శాతం నుంచి 58 శాతానికి చేరింది. కోరమాండల్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ అనే అనుబంధ కంపెనీ ద్వారా ఈ కొనుగోలును చేపట్టింది. టెక్నాలజీ ద్వారా వివిధ రంగాల్లో టెక్నాలజీ ఆధారిత అప్లికేషన్లను ప్రోత్సహించాలనే యోచనతో దక్ష అన్‌మ్యాన్‌డ్‌ సిస్టమ్స్‌లో వాటా పెంచుకున్నట్టు కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అరుణ్‌ అలగప్పన్‌ తెలిపారు.

Updated Date - May 14 , 2024 | 05:40 AM