Share News

కన్సాలిడేషన్‌ కొనసాగింపు..!

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:15 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశం ఉంది. బెంచ్‌మార్క్‌ సూచీల్లో కన్సాలిడేషన్‌ కొనసాగనుంది. ఇప్పటికిప్పుడు సూచీలు మెరుగ్గా రాణించకపోవచ్చు...

కన్సాలిడేషన్‌ కొనసాగింపు..!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశం ఉంది. బెంచ్‌మార్క్‌ సూచీల్లో కన్సాలిడేషన్‌ కొనసాగనుంది. ఇప్పటికిప్పుడు సూచీలు మెరుగ్గా రాణించకపోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితేనే సూచీలకు నిర్ణయాత్మక గమనం ఉంటుంది. ఎఫ్‌ఐఐలు వెళ్లిపోవటం, రూపాయి బలహీనపడటం ప్రతికూల అంశాలు.

స్టాక్‌ రికమండేషన్స్‌

క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌: రెండేళ్లుగా డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ఈ షేరు ప్రస్తుతం వాల్యూజోన్‌లో ట్రేడవుతోంది. టర్న్‌ అరౌండ్‌ కనిపిస్తోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ పెరుగుతోంది. గత శుక్రవారంఈ షేరు 4.17 శాతం లాభంతో రూ.315 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.310/300 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.345/375 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.290 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


లారస్‌ ల్యాబ్స్‌: ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ఈ షేరు ప్రస్తుతం కీలక నిరోధ స్థాయికి చేరుకుంది. నెగటివ్‌ మార్కెట్లోనూ ఈ షేరు బలం ప్రదర్శించింది. చివరి నాలుగు సెషన్లలోనూ లాభపడింది. గత శుక్రవారం 2.82 శాతం లాభంతో రూ.586 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.580 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.655 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.560 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

లుమాక్స్‌ ఆటో: ప్రస్తుతం ఈ షేరు జీవితకాల గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతోంది. దిద్దుబాటు జరగటతో డిమాండ్‌ పెరుగుతోంది. పైగా ప్రతి త్రైమాసికంలోనూ మెరుగైన ఫలితాలు విడుదల చేస్తోంది. గత శుక్రవారం ఈ షేరు 2.73 శాతం లాభంతో రూ.637 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.630/610 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.670/690 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.575 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


లూపిన్‌: ఈ షేరు జీవితకాల గరిష్ఠ స్థాయిలో కొనసాగుతోంది. పైగా 2016 నాటి నిరోధాన్ని బ్రేక్‌ చేసింది. హెడ్‌లైన్‌ సప్లయ్‌ ముగిసినట్టే కనిపిస్తోంది. గత శుక్రవారం 2.09 శాతం లాభంతో రూ.2,227 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.2,200/2,180 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.2,350 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.2,140 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

అరబిందో ఫార్మా: ఈ ఏడాది ఆగస్టులో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత ఈ కౌంటర్‌లో 30 శాతం వరకు కరెక్షన్‌ జరిగింది. ప్రస్తుతం బేస్‌ ఏర్పడుతోంది. అక్యుములేషన్‌కు అవకాశం కనిపిస్తోంది. నిఫ్టీతో పోల్చితే బలం పుంజుకుంటోంది. గత శుక్రవారం రూ.1,269 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,250 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.1,360/1,380 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,220 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

Updated Date - Dec 30 , 2024 | 04:15 AM