Share News

నాట్కో ఫార్మా యూఎస్‌ఏపై ఫిర్యాదు

ABN , Publish Date - Apr 19 , 2024 | 02:30 AM

అమెరికాలోని నాట్కో ఫార్మా అనుబంధ సంస్థ నాట్కో ఫార్మా యూఎ్‌సఏ ఎల్‌ఎల్‌సీపై డెలావర్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో ఫిర్యాదు నమోదైంది. ఈ కంపెనీ డయాజపామ్‌ అనే ఇంజెక్షన్‌ ప్రీఫిల్డ్‌ సిరంజీలను...

నాట్కో ఫార్మా యూఎస్‌ఏపై ఫిర్యాదు

న్యూఢిల్లీ: అమెరికాలోని నాట్కో ఫార్మా అనుబంధ సంస్థ నాట్కో ఫార్మా యూఎ్‌సఏ ఎల్‌ఎల్‌సీపై డెలావర్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో ఫిర్యాదు నమోదైంది. ఈ కంపెనీ డయాజపామ్‌ అనే ఇంజెక్షన్‌ ప్రీఫిల్డ్‌ సిరంజీలను మార్కెట్‌ చేయడంపై ఫ్రెషినియస్‌ కబీ యూఎ్‌సఏ ఎల్‌ఎల్‌సీ, ఫ్రెషినియస్‌ కబీ డచ్‌ల్యాండ్‌ జీఎంబీహెచ్‌ అనే సంస్థలు ఈ ఫిర్యాదు చేశాయి. డాష్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఎల్‌ఎల్‌సీని నాట్కో ఫార్మా కొనుగోలు చేసి దాని పేరును నాట్కో ఫార్మా యూఎ్‌సఏ ఎల్‌ఎల్‌సీగా మార్చింది. డయాజపామ్‌ ఇంజెక్షన్లను మానసిక వ్యాకులత, కండరాల సంకోచం, మద్యం సేవించడం వల్ల వచ్చే వికారాల తొలగింపు కోసం ఉపయోగిస్తారు. కాగా ఈ విషయాన్ని కోర్టులో ఎదుర్కొంటామని నాట్కో ఫార్మా తెలిపింది.

Updated Date - Apr 19 , 2024 | 02:30 AM