బిల్డర్ల ఆగడాలకు చెక్ పెట్టండి
ABN , Publish Date - Oct 21 , 2024 | 02:30 AM
పెరిగిపోతున్న బిల్డర్ల అక్రమాలకు చెక్ పెట్టాలనే వాదన మరింత ఊపందుకుంది. ఇందుకోసం 2019 నాటి ‘వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం’ పరిధిలోనే ‘స్థిరాస్తి’ రంగానికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు....
ప్రభుత్వానికి ఎఫ్‌పీసీఈ వినతి
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న బిల్డర్ల అక్రమాలకు చెక్ పెట్టాలనే వాదన మరింత ఊపందుకుంది. ఇందుకోసం 2019 నాటి ‘వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం’ పరిధిలోనే ‘స్థిరాస్తి’ రంగానికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని నివాస గృహాల కొనుగోలుదారులకు ప్రాతినిధ్యం వహించే ‘ఫోరమ్ ఫర్ పీపుల్స్ కలెక్టివ్ ఎఫర్ట్స్ (ఎఫ్‌పీసీఈ) ప్రభుత్వాన్ని కోరింది. ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు అభయ్ ఉపాధ్యాయ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిధి ఖరేకి దీనికి సంబంధించి ఒక లేఖ రాశారు. బిల్డర్ల అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ మార్గదర్శకాలు తప్పనిసరి అని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు. ప్రస్తుతం వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద వినియోగదారుల ఫోరమ్స్‌లో దాఖలవుతున్న ఫిర్యాదుల్లో పది శాతం స్థిరాస్తి రంగానికి సంబంధించిన ఫిర్యాదులనే విషయాన్ని ఉపాధ్యాయ గుర్తు చేశారు.