Share News

ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి

ABN , Publish Date - Aug 07 , 2024 | 02:43 AM

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) కొత్త చైర్మన్‌గా తెలంగాణ వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టి ని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన...

ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి

మూడేళ్ల కాలానికి నియమించిన కేంద్రం

న్యూఢిల్లీ: భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) కొత్త చైర్మన్‌గా తెలంగాణ వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టి ని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం శెట్టి ఎస్‌బీఐ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 28తో పదవీ కాలం ముగియనున్న ప్రస్తుత చైర్మన్‌ దినేశ్‌ ఖారా స్థానాన్ని శెట్టి భర్తీ చేస్తారు. శ్రీనివాసులు శెట్టిని ఎస్‌బీఐ చైర్మన్‌గా నియమించాలన్న ఆర్థిక సేవల డిపార్ట్‌మెంట్‌ ప్రతిపాదనను అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ ఆమోదించింది. అలాగే, రాణా అశుతోష్‌ కుమార్‌ సింగ్‌ను బ్యాంక్‌ కొత్త ఎండీగా నియమించింది. ప్రస్తుతం సింగ్‌ బ్యాంక్‌ డిప్యూటీ ఎండీగా ఉన్నారు. దేశంలో అతిపెద్ద బ్యాంకైన ఎస్‌బీఐలో చైర్మన్‌తో పాటు నలుగురు ఎండీలు ఉంటారు.

Updated Date - Aug 07 , 2024 | 02:43 AM