Share News

Business News: ఏడాది క్రితం వేల కోట్ల ఆస్తి.. ఇప్పుడు జీరో.. ఎవరా వ్యక్తి..!

ABN , Publish Date - Apr 04 , 2024 | 01:10 PM

బైజుస్ సంస్థ ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత విలువైన ఎడ్యూ టెక్ సంస్థల్లో ఒకటిగా ఉండేది. ప్రస్తుతం ఈ సంస్థ దివాలా తీసే పరిస్థితికి చేరు కుంది. కరోనా సమయంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు డిమాండ్ పెరగడంతో..

Business News: ఏడాది క్రితం వేల కోట్ల ఆస్తి.. ఇప్పుడు జీరో.. ఎవరా వ్యక్తి..!

కాలం మారుతున్న కొద్దీ సమాజంలో ఎన్నో మార్పులు.. పేదవాడు ధనవంతులుగా మారుతున్న సందర్భాలతో పాటు.. ధనవంతుడు పేదలుగా మారుతున్న ఘటనలు ఎన్నో వింటుంటాం. వ్యాపారాల్లో వేల కోట్ల రూపాయిలు సంపాదించి.. ఆ తరువాత నష్టాలు రావడంతో ఆస్తులు పొగొట్టుకున్న వ్యాపారవేత్తల ఎందరో ఉన్నారు. ఇది అలాంటి ఘటనే. దేశంలో లీడింగ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ బైజూస్ (BYJUS) వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కరోనా సమయంలో ఈ సంస్థ సేవలను దేశంలో చాలామంది వినియోగించుకున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఆయన వద్ద వేల కోట్ల రూపాయిల సంపదతో దేశంలోని ధనవంతుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఇటీవల మారిన పరిస్థితుల కారణంగా యన వేల కోట్ల సంపద పతనమైంది. ఆయన అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం రవీంద్రన్ దగ్గర ఎటువంటి ఆస్తి లేనట్లు తెలుస్తోంది. ఆయన సంపద మొత్తం కరిగిపోయిందని ఫోర్బ్స్ సంస్థ లేటెస్ట్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో రవీంద్రన్ సంపద ఫోర్బ్స్ రిపోర్టు ప్రకారం 2.1 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.17,545 కోట్లు. ఇప్పడు మాత్రం ఆయన వద్ద ఎలాంటి ఆస్తులు లేవని ఫోర్బ్స్ వెల్లడించింది.

ప్రపంచ టాప్‌ 10లోకి అంబానీ


ఒకప్పుడు..

బైజుస్ సంస్థ ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత విలువైన ఎడ్యూ టెక్ సంస్థల్లో ఒకటిగా ఉండేది. ప్రస్తుతం ఈ సంస్థ దివాలా తీసే పరిస్థితికి చేరుకుంది. కరోనా సమయంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు డిమాండ్ పెరగడంతో బైజూస్ ఒక వెలుగు వెలిగింది. ఇదే క్రమంలో పెద్ద మొత్తంలో బ్రాంచులు, ట్యూషన్ సెంటర్లను తెరిచింది.


విస్తరణ..

ఇలా వ్యాపారాల్ని క్రమక్రమంగా అమెరికా సహా ఇతర దేశాలకు విస్తరించింది. వందల కొద్దీ ట్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విదేశీ నిధులకు సంబంధించి నిబంధనల ఉల్లంఘన ఆరోపణలను ఈ సంస్థ ఎదుర్కొంది. దీంతో బైజుస్‌పై మనీలాండరింగ్ కేసు నమోదైంది. కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిపింది. మరోవైపు సంస్థకు అప్పుల భారం ఎక్కువైంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో వ్యాపారం పడిపోయింది. నిధుల సమీకరణ కష్టమైంది. దీంతో ఒక దశలో నిర్వహణే కష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.


జీతాలు చెల్లించలేక..

బైజుస్ సంస్థ ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించలేని పరిస్థితికి చేరుకుంది. పీఎఫ్ బకాయిలు చెల్లించలేదు. ఉద్యోగుల్ని పెద్ద మొత్తంలో తొలగించింది. బోర్డు సభ్యులు వరుసగా రాజీనామాలు చేశారు. బైజూస్ నుంచి రవీంద్రన్‌ను తప్పించాలన్న డిమాండ్లు వినిపించాయి. రైట్స్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. ఇలా ఎన్నో సవాళ్ల నడుమ బైజూస్ తన ఉనికిని కోల్పోతూ వచ్చింది. సంస్థ వాల్యుయేషన్ ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇటీవల అది కేవలం 200 మిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇటీవల కాలంలో కొన్ని ట్యూషన్ సెంటర్లను మూసేసింది. బెంగళూరులోని తన ప్రధాన కార్యాలయం మినహా మిగతా కార్యాలయాలను మూసేసింది. గతేడాది బిలియనీర్ల జాబితా నుంచి నలుగురు వైదొలగగా.. వారిలో ఒకరు బైజు రవీంద్రన్ అని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది.

స్వల్ప నష్టాలతో సరి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Updated Date - Apr 04 , 2024 | 01:19 PM