Share News

కావేరీ సీడ్స్‌ రూ.325 కోట్ల షేర్ల బైబ్యాక్‌

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:48 AM

హైదరాబాద్‌కు చెందిన కావేరీ సీడ్స్‌ బోర్డు శుక్రవారం రూ.325 కోట్ల విలువైన సొంత షేర్ల తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌)కు ఆమోదం తెలిపింది.

కావేరీ సీడ్స్‌ రూ.325 కోట్ల షేర్ల బైబ్యాక్‌

హైదరాబాద్‌కు చెందిన కావేరీ సీడ్స్‌ బోర్డు శుక్రవారం రూ.325 కోట్ల విలువైన సొంత షేర్ల తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌)కు ఆమోదం తెలిపింది. టెండర్‌ ఆఫర్‌ పద్ధతిన జరగనున్న ఈ బైబ్యాక్‌లో ఒక్కో షేరుకు చెల్లించనున్న ధరను కంపెనీ రూ.725గా నిర్ణయించింది. ప్రస్తుత షేరు ధరతో పోలిస్తే దాదాపు 10 శాతం అధికమిది. వారాంతం ట్రేడింగ్‌లో కావేరీ సీడ్స్‌ షేరు బీఎ్‌సఈలో 1.18 శాతం పెరిగి రూ.662.60 వద్ద ముగిసింది. బైబ్యాక్‌లో భాగంగా కంపెనీ గరిష్ఠంగా 44,82,758 షేర్లను కొనుగోలు చేయనుంది. కంపెనీ పెయిడప్‌ క్యాపిటల్‌లో 8.01 శాతం వాటాకు సమానమిది.

కాగా, ధామ్‌పూర్‌ షుగర్‌ మిల్స్‌ కంపెనీ మొత్తం పెయిడప్‌ క్యాపిటల్‌లో 1.50 శాతం వాటాకు సమానమైన 10 లక్షల షేర్లను ఒక్కోటీ రూ.300 చొప్పున తిరిగి కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.

Updated Date - Jan 06 , 2024 | 01:48 AM