Share News

పీఎస్‌బీల వ్యాపారం అదుర్స్‌

ABN , Publish Date - May 20 , 2024 | 04:44 AM

ఈ ఏడాది మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ) తమ వ్యాపారాన్ని (డిపాజిట్ల సేకరణ+రుణ వితరణ) గణనీయంగా పెంచుకున్నాయి. ఈ విషయంలో...

పీఎస్‌బీల వ్యాపారం అదుర్స్‌

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ) తమ వ్యాపారాన్ని (డిపాజిట్ల సేకరణ+రుణ వితరణ) గణనీయంగా పెంచుకున్నాయి. ఈ విషయంలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) 15.94 శాతం వృద్ధి రేటుతో మిగిలిన బ్యాంకుల కంటే ముందుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 13.12 శాతం వృద్ధి రేటుతో రెండో స్థానంలో ఉంది. వృద్ధి రేటులో ముందున్నా డిపాజిట్లు, అడ్వాన్స్‌లపరంగా చూస్తే ఎస్‌బీఐ-బీఓఎం మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 2023-24లో బీఓఎంతో పోలిస్తే ఎస్‌బీఐ వ్యాపారం 16.7 రెట్లు ఎక్కువ. ఎస్‌బీఐ మొత్తం బిజినెస్‌ 2023-24లో రూ.79,52,784 కోట్లు ఉంటే బీఓఎం బిజినెస్‌ రూ.4,74,411 కోట్లు మాత్రమే.


డిపాజిట్ల సేకరణ పరంగా: డిపాజిట్ల సమీకరణ వృద్ధి రేటు పరంగా చూసినా బీఓఎం 15.66 శాతం వృద్ధి రేటుతో అగ్రస్థానంలో ఉంది. 11.07 శాతంతో ఎస్‌బీఐ రెండో స్థానంలో, 11.05 శాతంతో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) మూడో స్థానంలో, 10.98 శాతం వృద్ధి రేటుతో కెనరా బ్యాంక్‌ నాలుగో స్థానంలో నిలిచాయి. డిపాజిట్ల సమీకరణ పరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరం ఈ నాలుగు పీఎ్‌సబీలు మాత్రమే రెండంకెల వృద్ధి రేటు నమోదు చేశాయి.

అగ్రస్థానంలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర

Updated Date - May 20 , 2024 | 04:44 AM