Share News

Stock markets: ఒక్కరోజులోనే రూ.6 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద

ABN , Publish Date - Jan 30 , 2024 | 05:25 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో భారీగా లాభపడ్డాయి. మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సతో పాటు బ్యాంకింగ్‌ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరపడం ఇందుకు దోహదపడింది...

Stock markets: ఒక్కరోజులోనే రూ.6 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద

సెన్సెక్స్‌ 1,241 పాయింట్లు అప్‌

21,700 ఎగువకు నిఫ్టీ

రిలయన్స్‌, బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో భారీగా లాభపడిన సూచీలు

ఒక్కరోజులో రూ.6 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో భారీగా లాభపడ్డాయి. మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సతో పాటు బ్యాంకింగ్‌ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరపడం ఇందుకు దోహదపడింది. ఇంట్రాడేలో 1,309 పాయింట్లు ఎగిసి 72,000 స్థాయిని దాటిన సెన్సెక్స్‌.. చివరికి 1,240.90 పాయింట్ల (1.76 శాతం) లాభంతో 71,941.57 వద్ద ముగిసింది. నిఫ్టీ 385 పాయింట్ల (1.80 శాతం) వృద్ధితో 21,737.60 వద్దకు చేరుకుంది. గత ఏడాది డిసెంబరు 4 తర్వాత సూచీలకిది అతిపెద్ద లాభం. కొనుగోళ్ల హోరుతో మదుపరుల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఒక్కరోజే రూ.6.09 లక్షల కోట్ల మేర పెరిగి రూ.377.20 లక్షల కోట్లుగా (4.53 లక్షల కోట్ల డాలర్లు) నమోదైంది.

30లో 25 లాభాల్లో..

సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 25 లాభాల్లో పయనించాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు దాదాపు 7 శాతం వృద్ధితో సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌, ఎల్‌ అండ్‌ టీ, కోటక్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ షేర్లు మూడు శాతానికి పైగా పుంజుకోగా.. అలా్ట్రటెక్‌ సిమెంట్‌, టైటాన్‌ 2 శాతానికి పైగా పెరిగాయి. త్రైమాసిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఐటీసీ షేరు 1.20 శాతం క్షీణించి సెన్సెక్స్‌ టాప్‌ లూజర్‌గా మిగిలింది. ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, జేఎ్‌సడబ్ల్యూ స్టీల్‌ అర శాతానికి పైగా నష్టపోయాయి. బీఎ్‌సఈలోని మిడ్‌క్యాప్‌ సూచీ 1.68 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.03 శాతం పెరిగాయి. రంగాలవారీ సూచీల్లోనూ ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, టెక్‌ తప్ప మిగతావన్నీ లాభపడ్డాయి. ఎనర్జీ రంగ సూచీ ఏకంగా 5.29 శాతం వృద్ధి చెందగా.. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 4.94 శాతం, పవర్‌ 3.03 శాతం పెరిగాయి. సర్వీసెస్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఇండస్ట్రియల్స్‌ ఇండెక్స్‌లు రెండు శాతానికి పైగా ఎగబాకాయి. బ్యాంకెక్స్‌ 1.42 శాతం బలపడింది.

  • ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు క్షీణించి 83.16 వద్ద ముగిసింది. ముడి చమురు ధరల పెరుగుదల, ఇంధన దిగుమతిదారులు డాలర్‌ కొనుగోళ్లకు పాల్పడటం మన కరెన్సీని బలహీనపరించింది.

  • అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ రకం ముడి చమురు పీపా ధర ఒక దశలో 8305 డాలర్ల వద్ద ట్రేడైంది. ఇరాన్‌ మిలిటెంట్లకు చెందిన డ్రోన్‌ అమెరికా సాయుధ దళాలపై దాడి జరిపిన నేపథ్యంలో బైడెన్‌ సర్కారు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. ఈ పరిణామంతో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చన్న ఆందోళనలు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి.

రిలయన్స్‌ .. రూ.19.60 లక్షల కోట్లు

రూ.2,900 స్థాయికి కంపెనీ షేరు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు రివ్వున ఎగిసింది. బీఎ్‌సఈలో కంపెనీ షేరు ధర ఒకదశలో 7.18 శాతం వృద్ధితో రూ.2,905 వద్ద సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి షేరు 6.86 శాతం లాభంతో రూ.2,896.15 వద్ద ముగిసింది. దాంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఒక్కరోజులోనే రూ.1.26 లక్షల కోట్ల మేర పెరిగి మొత్తం రూ.19.59 లక్షల కోట్లకు చేరుకుంది. రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.19 లక్షల కోట్ల మైలురాయిని దాటం ఇదే తొలిసారి. సోమ వారం సెన్సెక్స్‌, నిఫ్టీ లాభంలో 37 శాతం వాటా రిలయన్స్‌దే. గత మూడు సెషన్లుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు లాభా ల్లో పయనిస్తోంది. ఈ మూడ్రోజుల్లో 9 శాతం పెరిగాయి. ఈ నెలలో ఇప్పటివరకు 12 శాతం వృద్ధి కనబర్చింది.

  • కలిసివచ్చిన అంశాలు..

  • ఆసియా స్టాక్‌ మార్కెట్లలో ర్యాలీ

  • మధ్యంతర బడ్జెట్‌పై సానుకూల అంచనాలు

  • ఈ మధ్య భారీగా నష్టపోయిన బ్యాంకింగ్‌, ఇతర షేర్లలో తిరిగి కొనుగోళ్లకు పాల్పడిన ఇన్వెస్టర్లు

  • తాజాగా విడుదలైన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఉండటం

Updated Date - Jan 30 , 2024 | 07:08 AM