సెన్సెక్స్ ర్యాలీకి బ్రేక్
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:53 AM
స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల స్వీకారంతో నష్టాల బారిన పడ్డాయి. సెన్సెక్స్ 195.16 పాయింట్ల నష్టంతో 73,677.13 వద్ద ముగియగా నిఫ్టీ 49.30 పాయింట్ల నష్టంతో 22,356.30 వద్ద క్లోజయింది...

ముంబై: స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల స్వీకారంతో నష్టాల బారిన పడ్డాయి. సెన్సెక్స్ 195.16 పాయింట్ల నష్టంతో 73,677.13 వద్ద ముగియగా నిఫ్టీ 49.30 పాయింట్ల నష్టంతో 22,356.30 వద్ద క్లోజయింది. దీంతో వరుసగా నాలుగు సెషన్స్ ర్యాలీకి బ్రేక్ పడింది.
ఐపీఓ బాటలో బిగ్ బాస్కెట్
టాటా గ్రూప్ నుంచి మరో కంపెనీ ఐపీఓకు రానుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే బహుశా వచ్చే ఏడాది ఈ ఐపీఓ ఉంటుందని బిగ్ బాస్కెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ హరి మీనన్ చెప్పారు. అయితే దీనిపై తుది నిర్ణయం టాటాలదేని తెలిపారు. వచ్చే ఆరు లేదా ఎనిమిది నెలల్లో బిగ్ బాస్కెట్ లాభాల బాట పడుతుందన్నారు. ఇటీవల ప్రారంభించిన ‘బీబీ వెర్టికల్’ లాభాల్లోనే ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం టర్నోవర్ రూ.12,000 కోట్లకు చేరే అవకాశం ఉందని చెప్పారు.
ఆల్‌టైం గరిష్ఠానికి బిట్‌కాయిన్
బిట్‌కాయిన్ సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరుకుంది. కాయిన్ మార్కెట్ క్యాప్ ప్రకారం.. మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో ఈ వర్చువల్ కరెన్సీ విలువ తొలిసారిగా 69,000 డాలర్ల మైలురాయికి ఎగువకు చేరుకుంది. అంతేకాదు, రెండేళ్ల కు పైగా కాలంలో (2021 నవంబరు) ఈ కరెన్సీ కొత్త ఆల్‌టైం రికార్డును నమోదు చేయడం కూడా ఇదే మొదటిసారి.