Share News

బీఓఎం లాభం 1,036 కోట్లు

ABN , Publish Date - Jan 17 , 2024 | 05:44 AM

ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం).. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.1,036 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది...

బీఓఎం లాభం 1,036 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం).. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.1,036 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే లాభం 34 శాతం (రూ.775 కోట్లు) వృద్ధి చెందింది. వడ్డీ ఆదాయం పెరగటం, మొండి బకాయిలు (ఎన్‌పీఏ) తగ్గుముఖం పట్టడం ఎంతగానో కలిసివచ్చిందని పేర్కొంది. కాగా త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.4,770 కోట్ల నుంచి రూ.5,851 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ.1,980 కోట్ల నుంచి రూ.2,466 కోట్లకు పెరిగింది.

Updated Date - Jan 17 , 2024 | 05:44 AM