మహిళల కోసం బీఓబీ కొత్త ఆఫర్లు
ABN , Publish Date - Mar 08 , 2024 | 02:35 AM
ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల కోసం బీఓబీ మహిళా శక్తి సేవింగ్స్ అకౌంట్...
ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల కోసం బీఓబీ మహిళా శక్తి సేవింగ్స్ అకౌంట్, బీఓబీ విమెన్ పవర్ కరెంట్ అకౌంట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఖాతాలు తెరిచే వారికి ఆక్షణీయమైన ఆఫర్లు, ప్రయోజనాలు కూడా ప్రకటించింది. ఈ ఆఫర్ ఈ ఏడాది జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. రుణ సదుపాయాలు ఈ ఏడాది డిసెంబరు 31 వరకు అందుబాటులో ఉంటాయి.