ఏడాదిలో జొమాటోను మించిపోనున్న బ్లింకిట్
ABN , Publish Date - Mar 19 , 2024 | 03:29 AM
క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ (గతంలో గ్రోఫర్స్) సైజు జొమాటో ఫుడ్ డెలివరీ బిజినె్‌సను మించిపోనుందని ఈ రెండు కంపెనీల సీఈఓ దీపిందర్ గోయల్ అన్నారు...
క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ (గతంలో గ్రోఫర్స్) సైజు జొమాటో ఫుడ్ డెలివరీ బిజినె్‌సను మించిపోనుందని ఈ రెండు కంపెనీల సీఈఓ దీపిందర్ గోయల్ అన్నారు. 2022లో బ్లింకిట్‌ను జొమాటో 57 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం కంపెనీ మొత్తం ఆదాయంలో జొమాటో ఫుడ్ డెలివరీ వ్యాపార వాటా 56 శాతంగా ఉంది. కంపెనీ తదుపరి వృద్ధికి బ్లింకిట్ చోదకం కానుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. బ్లింకిట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించి పూర్తి స్థాయి ఈ-కామర్స్ కంపెనీగా మార్చే దిశగా జొమాటో ఆలోచిస్తోంది.