Share News

బిగ్‌ సీ సంక్రాంతి ఆఫర్లు

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:33 AM

మొబైల్‌ రిటైలింగ్‌ చెయిన్‌ బిగ్‌ సీ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. తమ షోరూమ్‌లో మొబైల్‌ కొనుగోలు చేసిన వారికి రూ.3,000 వరకు తక్షణ డిస్కౌంట్‌తో...

బిగ్‌ సీ సంక్రాంతి ఆఫర్లు

హైదరాబాద్‌: మొబైల్‌ రిటైలింగ్‌ చెయిన్‌ బిగ్‌ సీ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. తమ షోరూమ్‌లో మొబైల్‌ కొనుగోలు చేసిన వారికి రూ.3,000 వరకు తక్షణ డిస్కౌంట్‌తో పాటు రూ.4,999 విలువ గల స్మార్ట్‌ వాచ్‌ ఉచితంగా అందిస్తున్నట్టు సీఎండీ బాలు చౌదరి తెలిపారు. అలాగే రూ.1,10,000 విలువ గల హెల్త్‌కేర్‌ బెనిఫిట్‌, రూ.75,000 విలువ గల పేమెంట్‌ బెనిఫిట్‌ అందిస్తున్నామన్నారు. సంక్రాంతి సందర్భంగా వివో ఎక్స్‌ 100 సీరీస్‌ స్మార్ట్‌ఫోన్లు ప్రవేశపెట్టామని, ఈ ఫోన్‌ కొనుగోలు చేసిన వారికి 10 శాతం తక్షణ క్యాష్‌బాక్‌తో పాటు రూ.10,999 విలువ గల ఫైర్‌బోల్ట్‌ స్మార్ట్‌ వాచ్‌, టీడబ్ల్యూఎస్‌ బడ్స్‌ ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. దీనితో పాటు రెడ్‌మీ నోట్‌ 13 సీరీస్‌ మొబైల్స్‌ కూడా విడుదల చేశామంటూ ఈ మొబైల్‌ కొనుగోలు చేసిన వారికి రూ.2,000 క్యాష్‌బాక్‌తో పాటు డిన్నర్‌ సెట్‌ ఉచితంగా అందిస్తున్నట్టు వెల్లడించారు. వీటితో పాటుగా ఎన్నో ఆకర్షణీయమైన ఇతర ఆఫర్లు కూడా ఉన్నట్టు చెప్పారు.

Updated Date - Jan 11 , 2024 | 03:33 AM