Share News

గోల్డ్‌ లోన్లపై జర జాగ్రత్త

ABN , Publish Date - May 16 , 2024 | 05:03 AM

ఎన్‌బీఎఫ్‌సీల గోల్డ్‌ లోన్లపై ఆర్‌బీఐ దృష్టి పెట్టింది. ఈ కంపెనీలు రుణాలు మంజూరు చేసేటపుడు లోన్‌ టు వాల్యూ రేషియో, వేలం పద్దతి, నగదు పంపిణీ విషయాల్లో...

గోల్డ్‌ లోన్లపై జర జాగ్రత్త

ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ ఆదేశం

ముంబై: ఎన్‌బీఎఫ్‌సీల గోల్డ్‌ లోన్లపై ఆర్‌బీఐ దృష్టి పెట్టింది. ఈ కంపెనీలు రుణాలు మంజూరు చేసేటపుడు లోన్‌ టు వాల్యూ రేషియో, వేలం పద్దతి, నగదు పంపిణీ విషయాల్లో తూచా తప్పకుండా నిబంధనలు పాటించాలని కోరింది. ఐఐఎఫ్‌ ఎల్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఈ నిబంధనలు తుంగలో తొక్కిందని తేలడంతో ఆర్‌బీఐ ఈ విషయంలో కఠిన వైఖరి అవలంభిస్తోంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఏ లావాదేవీల్లోనూ రూ.20,000కు మించి నగదు ఇవ్వరాదు. కానీ కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు పసిడి రుణాలు ఇచ్చేటపుడు మొత్తం రుణంలో 40 నుంచి 50 శాతం నగదు రూపంలో ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఖాతాదారుల ఆభరణాల వేలం నిబంధనల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని కోరింది.

Updated Date - May 16 , 2024 | 05:03 AM