అప్రమత్తంగా ఉండటం బెటర్!
ABN , Publish Date - Oct 21 , 2024 | 02:41 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశాలున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్‌కు కారణంగా ఉన్నాయి. ఈ వారం నిఫ్టీకి...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశాలున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్‌కు కారణంగా ఉన్నాయి. ఈ వారం నిఫ్టీకి 24,850 వద్ద మద్దతు, 25,000 వద్ద నిరోధం ఉన్నాయి. నిఫ్టీ.. మరికొన్ని సెషన్లు ఇదే శ్రేణిలో కదలాడే అవకాశం ఉంది.
స్టాక్ రికమండేషన్స్
మజగాన్ డాక్: బలహీనమైన మార్కెట్ సెంటిమెంట్‌లోనూ బలంగా పుంజుకున్న షేరు ఇది. జీవితకాల గరిష్ఠ స్థాయి నుంచి 34 శాతం మేర కరెక్షన్ జరిగింది. ప్రస్తుతం భారీ వాల్యూమ్‌తో అక్యుములేషన్ కొనసాగుతోంది. రూ.4,000 స్థాయిలో మద్దతు తీసుకున్న ఈ కౌంటర్ గత శుక్రవారం 6.81 శాతం లాభంతో రూ.4,526 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.4,550/4,500 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.4,850/5,000 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.4,400 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఎన్‌ఎండీసీ: గత ఏడాది అక్టోబరు నుంచి మే నెల వరకు అప్‌ట్రెండ్‌లో కొనసాగిన ఈ షేరులో ప్రస్తుతం దిద్దుబాటు కనిపిస్తోంది. రూ.206 స్థాయిలో మద్దతు తీసుకున్న తర్వాత హయ్యర్ హైస్ ఫామ్ ఏర్పడటం బలాన్ని సూచిస్తోంది. గత శుక్రవారం 3.31 శాతం లాభంతో రూ.231 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లోకి మూమెంటమ్ ఇన్వెస్టర్లు రూ.230/220 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.265/290 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.210 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
బాటా ఇండియా: చాలా కాలంగా డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతూ వస్తున్న ఈ కౌంటర్‌లో ప్రస్తుతం మూమెంటమ్, రిలేటివ్ స్ట్రెంత్ పెరుగుతున్నాయి. సెప్టెంబరు త్రైమాసికంలో ఈపీఎస్ 173 శాతం పెరగటం, మంచి ఫలితాలు విడుదల చేస్తుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. గత శుక్రవారం ఈ షేరు 2.09 శాతం లాభంతో రూ.1,464 వద్ద ముగిసింది. మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.1,450 స్థాయిలో పొజిషన్ తీసుకుని రూ.1,550/1,600 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,420 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
టొరెంట్ పవర్: ప్రస్తుతం ఈ షేరు మంచి రిస్క్ రివార్డ్ రేషియోతో లభిస్తున్నాయి. జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతోంది. నిఫ్టీతో పోల్చితే మెరుగ్గా రాణిస్తోంది. గత శుక్రవారం ఈ షేరు 1.75 శాతం లాభంతో రూ.1,973 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.1,950 శ్రేణిలో ఎంటరై రూ.2,050/2,110 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,910 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
హిందాల్కో: నిఫ్టీతో పోలిస్తే ఈ కౌంటర్ మెరుగ్గా రాణిస్తోంది. రిలేటివ్ స్ట్రెంత్ బాగుంది. బలహీనమైన మార్కెట్లోనూ ఈ షేరు అదరగొడుతోంది. గత శుక్రవారం 2.4 శాతం లాభంతో రూ.753 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.730/750 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.810/840 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించాలి. అయితే రూ.720 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.