అప్రమత్తంగా ఉండటం బెటర్ !
ABN , Publish Date - Jul 08 , 2024 | 06:29 AM
ఇన్వెస్టర్లు ఈ వారం అప్రమత్తంగా ఉండటం మంచిది. బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరటమే ఇందుకు కారణం. రానున్న రోజుల్లో సూచీల గమనం...

ఇన్వెస్టర్లు ఈ వారం అప్రమత్తంగా ఉండటం మంచిది. బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరటమే ఇందుకు కారణం. రానున్న రోజుల్లో సూచీల గమనం ఎలా ఉంటుందో తెలియదు కానీ సమీప భవిష్యత్‌లో కొంత కరెక్షన్‌కు ఆస్కారం ఉంది. ఈ వారం రైల్వే, డిఫెన్స్ రంగాల షేర్లు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్టాక్ రికమండేషన్స్
ఐఆర్‌సీటీసీ: సుదీర్ఘకాలం అప్‌ట్రెండ్‌లో కొనసాగిన ఈ షేరు కొన్నాళ్లుగా కరెక్షన్ అవుతోంది. అయితే డెలివరీ, ట్రేడింగ్ వాల్యూమ్ తగ్గటాన్ని బట్టి చూస్తే మరికొన్ని రోజుల్లోనే పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. సాధారణ ప్రయాణికుల కోసం కోచ్‌లు పెంచనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించటంతో ఇన్వెస్టర్లు ఈ షేరుపై ఆసక్తిని కనబరుస్తున్నారు. గత శుక్రవారం ఈ షేరు 1.98 శాతం లాభంతో రూ.1,026 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.1,000/1,010 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.1,155/ 1,120 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.975 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
హెచ్‌బీఎల్ పవర్: టెక్నికల్‌గా చూస్తే ఈ షేరుకు చాలా సానుకూలతలు కనిపిస్తున్నాయి. భారీ డెలివరీ, ట్రేడింగ్ వాల్యూమ్‌తో ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ అయ్యింది. గత శుక్రవారం ఈ షేరు7.5 శాతం లాభంతో రూ.569 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లోకి రూ.550 శ్రేణిలో ప్రవేశించి రూ.590/660 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.525 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఐఆర్‌ఎ్‌ఫసీ: ఈ కౌంటర్‌లో ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న కన్సాలిడేషన్ ముగింపు దశకు చేరుకుంది. గత శుక్రవారం మంచి వాల్యూమ్‌తో అంతకు ముందు వారం గరిష్ఠాన్ని బ్రేక్ చేసి చివరకు 5.91 శాతం లాభంతో రూ.188.23 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.185 స్థాయిలో పొజిషన్ తీసుకుని రూ.199/210 టార్గె ట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.182 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
బీఈఎల్: ప్రభుత్వ రంగానికి చెందిన ఈ షేరు తాజాగా జీవితకాల గరిష్ఠాన్ని బ్రేక్ చేసింది. వాల్యూమ్ కూడా పెరుగుతోంది. చివరి మూడు సెషన్లలో ప్రైస్ యాక్షన్ చాలా బాగుంది. గత శుక్రవారం ఈ షేరు 2.11 శాతం లాభంతో రూ.324 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లోకి రూ.320 స్థాయిలో ఎంటరై రూ.345/390 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ. 314 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఎస్‌బీఐ లైఫ్: కరెక్షన్ తర్వాత ఈ షేరులో మూమెంటమ్ పెరిగింది. మళ్లీ అప్‌ట్రెండ్ మొదలైంది. పెద్దపెద్ద క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. పైగా నిఫ్టీతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన చేస్తోంది. అప్పర్ బొలింజర్ బ్యాండ్ బ్రేక్ చేసింది. గత శుక్రవారం ఈ షేరు 1.04 శాతం లాభంతో రూ.1,529 దగ్గర క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లోకి రూ.1,520/1,500 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.1,575/1,640 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,475 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.