Share News

అప్రమత్తతే మేలు

ABN , Publish Date - May 27 , 2024 | 03:01 AM

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు ఆఖరు దశకు చేరుకోవటం, సూచీలు ఇప్పటికే గరిష్ఠ స్థాయిల్లో ఉండటం, స్పెక్యులేషన్‌ విపరీతంగా ఉండటంతో...

అప్రమత్తతే మేలు

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు ఆఖరు దశకు చేరుకోవటం, సూచీలు ఇప్పటికే గరిష్ఠ స్థాయిల్లో ఉండటం, స్పెక్యులేషన్‌ విపరీతంగా ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. నిఫ్టీకి 22,850 వద్ద మద్దతు, 23,100 వద్ద నిరోధ స్థాయిలు ఉన్నాయి. గతవారం ప్రభుత్వ రంగ సంస్థల షేర్లు జోరు ప్రదర్శించాయి. మీడియా, మెటల్‌, ఆటో రియాల్టీ, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ సూచీలు పెరిగాయి.

స్టాక్‌ రికమండేషన్స్‌

టీవీఎస్‌ మోటార్స్‌: త్రైమాసిక ఫలితాల తర్వాత ఈ షేరు దూసుకుపోతోంది. డెలివరీ వాల్యూమ్‌ విపరీతంగా పెరుగుతోంది. పైగా గత వారం.. నెల గరిష్ఠాలను బ్రేక్‌ చేయటం శుభసూచకం. మూమెంటమ్‌ ఇలాగే కొనసాగితే జీవితకాల గరిష్ఠాన్ని అధిగమించే అవకాశం ఉంది. గత శుక్రవారం ఈ షేరు 2.91 శాతం లాభంతో రూ.2,238 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.2,220/2,230 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.2,320/2,350 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.2,200 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


అదానీ గ్రీన్‌ ఎనర్జీ: కొన్నాళ్లుగా సైడ్‌వే్‌సలో చలిస్తూ వస్తున్న ఈ షేర్లకు మళ్లీ ఊపొచ్చింది. నిఫ్టీతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ఆర్థిక ఫలితాలు విడుదలైన తర్వాత బుల్లి్‌షనెస్‌ వచ్చింది. చివరి 11 సెషన్లలో ఈ షేరు 18 శాతం పెరిగింది. గత శుక్రవారం ఈ షేరు 1.81 శాతం లాభంతో రూ.1,923 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లోకి రూ.1,910/1,900 శ్రేణిలో ప్రవేశించి రూ.2,020/2,060 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,880 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌: సుదీర్ఘకాలం అప్‌ట్రెండ్‌లో కొనసాగిన ఈ కౌంటర్‌లో కొన్ని రోజులు దిద్దుబాటు జరిగింది. తాజా త్రైమాసిక ఫలితాల తర్వాత జోరు పెరిగింది. రూ.485 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని బ్రేక్‌ చేసింది. ఐదు రోజుల సగటు వాల్యూమ్‌ మూడు రెట్లు పెరిగింది. గత శుక్రవారం ఈ షేరు 5.2 శాతం లాభంతో రూ.491 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లోకి రూ.485/490 పై స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.550/575 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.470 వద్ద కచ్చితమైన స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.

రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌: ఈ కౌంటర్‌లో కరెక్షన్‌ ముగిసినట్టే కనిపిస్తోంది. డివిడెండ్‌ ప్రకటించిన తర్వాత షేర్లలో మూమెంటమ్‌ పెరిగింది. చివరి వారం నెల గరిష్ఠాన్ని అధిగమించింది. అప్పర్‌ బొలింజర్‌ బ్యాండ్‌ బ్రేక్‌ అవడం గమనార్హం. గత శుక్రవారం ఈ షేరు 6.47 శాతం లాభంతో రూ.157 వద్ద స్థిరపడింది. ఈ కౌంటర్‌లోకి మదుపరులు రూ.155 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.178/190 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.149 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


బీపీసీఎల్‌: మంచి అప్‌ట్రెండ్‌ అనంతరం ఈ షేరులో దిద్దుబాటు జరిగింది. మార్చి త్రైమాసిక ఫలితాల తర్వాత మూమెంటమ్‌ పెరిగింది. జీవతకాల గరిష్ఠాన్ని బ్రేక్‌ చేసే దిశగా సాగుతోంది. గత శుక్రవారం ఈ షేరు రూ.654 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.650 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.720/760 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.620 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

Updated Date - May 27 , 2024 | 03:01 AM