ఐసీఐసీఐ ప్రు మల్టీ అసెట్ ఫండ్‌తో మెరుగైన రిటర్నులు
ABN , Publish Date - Jun 17 , 2024 | 04:23 AM
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్.. మదుపరులకు మంచి రిటర్నులు అందించటంలో ముందు వరుసలో ఉంది. ఈ ఫండ్ 2002 అక్టోబరు 31న ప్రారంభమైన నాటి నుంచి సగటున ఏటా 21.5 శాతం వృద్ధితో...

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్.. మదుపరులకు మంచి రిటర్నులు అందించటంలో ముందు వరుసలో ఉంది. ఈ ఫండ్ 2002 అక్టోబరు 31న ప్రారంభమైన నాటి నుంచి సగటున ఏటా 21.5 శాతం వృద్ధితో రిటర్నులు అందించటం విశేషం. ఈ ఫండ్ ప్రారంభ సమయంలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఇది రూ.65.4 లక్షలకు చేరుకుంది. ఇదే సమయంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్ 17.1 శాతం వృద్ధి చెందింది. గడచిన ఏడాదిని ప్రాతిపదికగా తీసుకుంటే 33.1 శాతం రిటర్నులు అందించింది. గడచిన ఐదేళ్లలో ప్రతి నెల రూ.10,000 క్రమానుగత పెట్టుబడుల (సిప్) రూపంలో పెట్టి ఉంటే ఆ పెట్టుబడి మొత్తం రూ.6 లక్షల నుంచి రూ.10.98 లక్షలకు పెరిగింది.
స్కోడా ఆటో ఇండియా మార్కెట్లోకి సరికొత్త కుషాక్ ఓనిక్స్ ఏటీ తీసుకువచ్చింది. గత ఏడాది ఈ ఎస్‌యూవీని తీసుకువచ్చినప్పటికీ తాజాగా కొత్త హంగులతో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో విడుదల చేసింది. 1.0 టీఎ్‌సఐ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ వెర్షన్స్‌తో ఇది అందుబాటులో ఉండనుంది. కుషాక్ ఓనిక్స్ అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను కంపెనీ పొందుపరిచింది. ఈ కారు ధర రూ.13.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్).