Share News

తదుపరి తరం కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధిపై బీఈ కసరత్తు

ABN , Publish Date - Jan 17 , 2024 | 05:42 AM

బయోలాజికల్‌-ఈ (బీఈ) తదుపరి తరం కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధిపై కృషి చేస్తోంది. సార్స్‌-కొవ్‌-2 వైరస్‌ ఎక్స్‌బీబీ1.5 వేరియంట్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌...

తదుపరి తరం కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధిపై బీఈ కసరత్తు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): బయోలాజికల్‌-ఈ (బీఈ) తదుపరి తరం కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధిపై కృషి చేస్తోంది. సార్స్‌-కొవ్‌-2 వైరస్‌ ఎక్స్‌బీబీ1.5 వేరియంట్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌ అభివృద్ది చేస్తున్నట్లు బీఈ వెల్లడించింది. ప్రీ క్లినికల్‌ అధ్యయనాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉన్న వేరియంట్ల నుంచి ఈ వ్యాక్సిన్‌ రక్షణ కల్పిస్తుందని బీఈ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహిమ దాట్ల తెలిపారు. భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌కు ఇటీవల సీడీఎ్‌ససీఓ నుంచి బీఈ తుది అనుమతి తీసుకుంది. త్వరలో క్లినికల్‌ ట్రయల్స్‌ను కంపెనీ ప్రారంభించనుంది. కాగా, బీఈ చెందిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోర్బెవ్యాక్స్‌’ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌లో చేర్చింది.

Updated Date - Jan 17 , 2024 | 05:42 AM