Share News

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు బీడీఆర్‌ ఫార్మా

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:41 AM

పొస్ర్టేట్‌ క్యాన్సర్‌ చికిత్స కోసం నోటి ద్వారా ఉపయోగించే ఎంజాలుటామైడ్‌ సొల్యూషన్‌ మార్కెట్లోకి విడుదల చేసినట్లు బీడీఆర్‌ ఫార్మా వెల్లడించింది...

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు బీడీఆర్‌ ఫార్మా

ఓరల్‌ సొల్యూషన్‌

న్యూఢిల్లీ: పొస్ర్టేట్‌ క్యాన్సర్‌ చికిత్స కోసం నోటి ద్వారా ఉపయోగించే ఎంజాలుటామైడ్‌ సొల్యూషన్‌ మార్కెట్లోకి విడుదల చేసినట్లు బీడీఆర్‌ ఫార్మా వెల్లడించింది. ఈ తరహా కొత్త ఔషధం విడుదల చేసిన తొలి కంపెనీ తమదేనని బీడీఆర్‌ తెలిపింది. బిడెంజా 32 ఎంజీ/ఎంఎల్‌ పేరిట విడుదల చేసిన ఈ ఓరల్‌ సొల్యూషన్‌ 150 ఎంఎల్‌ ధర రూ.27,000 అని బీడీఆర్‌ ఫార్మా తెలిపింది. డీసీజీఐ అనుమతి లభించిన ఈ సొల్యూషన్‌ ప్రస్తుతం నోటి ద్వారా వాడుతున్న ఎంజాలుటామైడ్‌ ఔషధాల కన్నా తక్కువ సైడ్‌ ఎఫెక్ట్స్‌తో ఇది సమర్థవంతంగా పని చేస్తుందని కంపెనీ పేర్కొంది.

Updated Date - Jan 03 , 2024 | 01:41 AM