Share News

పెరగనున్న బేసిక్‌ సర్వీస్‌ డిమ్యాట్‌ ఖాతా పరిమితి

ABN , Publish Date - Jun 06 , 2024 | 03:52 AM

బేసిక్‌ సర్వీస్‌ డిమ్యాట్‌ ఖాతా (బీఎ్‌సడీఏ) పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని సెబీ భావిస్తోంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.2 లక్షలు మాత్రమే. దీనికి సంబంధించి ఒక చర్చా పత్రం...

పెరగనున్న బేసిక్‌ సర్వీస్‌ డిమ్యాట్‌ ఖాతా పరిమితి

న్యూఢిల్లీ: బేసిక్‌ సర్వీస్‌ డిమ్యాట్‌ ఖాతా (బీఎ్‌సడీఏ) పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని సెబీ భావిస్తోంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.2 లక్షలు మాత్రమే. దీనికి సంబంధించి ఒక చర్చా పత్రం విడుదల చేసింది. సంబంధిత వర్గాలు దీనిపై తమ అభిప్రాయాలు, సూచనలు ఈ నెల 26లోపు అందజేయాలని కోరింది. ఈ పరిమితి పెంపు ద్వారా సెక్యూరిటీల మార్కెట్‌లో రిటైల్‌ మదుపరులు మరింత చురుగ్గా పాల్గొనేందుకు వీలవుతుందని సెబీ భావిస్తోంది. కొద్ది మొత్తాల్లో పెట్టుబడులుండే చిన్న మదుపరులపై డిమ్యాట్‌ చార్జీలు తగ్గించేందుకు సెబీ 2012లో బీఎ్‌సడీఏను ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం బీఎ్‌సడీఏ ఖాతాల్లో రూ.2 లక్షల వరకు రుణ పత్రాలు, రూ.2 లక్షల వరకు ఇతర సెక్యూరిటీలు ఉంచుకోవచ్చు. ఈ రెండింటి పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని సెబీ భావిస్తోంది.

Updated Date - Jun 06 , 2024 | 03:52 AM