Share News

నేటి నుంచి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంఝౌతా ఔట్‌రీచ్‌

ABN , Publish Date - Nov 18 , 2024 | 02:43 AM

మొండి బకాయిల (ఎన్‌పీఏ) పరిష్కారం లక్ష్యంగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) సోమవారం నుంచి శుక్రవారం వరకు సంఝౌతా ఔట్‌రీచ్‌ కార్యక్రమం నిర్వహిస్తోంది...

నేటి నుంచి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంఝౌతా ఔట్‌రీచ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మొండి బకాయిల (ఎన్‌పీఏ) పరిష్కారం లక్ష్యంగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) సోమవారం నుంచి శుక్రవారం వరకు సంఝౌతా ఔట్‌రీచ్‌ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఎన్‌పీఏ ఖాతాలున్న వారికి ఈ ఐదు రోజుల్లో బకాయిల చెల్లింపునకు ఆకర్షణీయమైన తగ్గింపులతో ఏకకాల సెటిల్మెంట్‌ (ఓటీఎస్‌) అవకాశం కల్పిస్తారు. ఏదైనా న్యాయబద్ధమైన కారణంతో రుణ బకాయిలు సకాలంలో చెల్లించలేకపోయిన కస్టమర్లు సంబంధిత బ్యాంకు శాఖను సందర్శించి ఏకకాల పరిష్కారం పొంది రుణవిముక్తులు కావాలని బ్యాంకు పిలుపు ఇచ్చింది.

Updated Date - Nov 18 , 2024 | 02:43 AM