బైజూస్ జీతాలు చెల్లించాల్సిందే
ABN , Publish Date - Jul 05 , 2024 | 05:20 AM
ఎడ్యు స్టార్టప్ బైజూ్‌సకి ఎన్‌సీఎల్‌టీ బెంగళూరు బెంచ్ గట్టి హెచ్చరిక చేసింది. ముందు ఉద్యోగుల జీతాల బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. లేకపోతే బైజూస్ ఆదాయ, వ్యయాల పుస్తకాలను...

బెంగళూరు: ఎడ్యు స్టార్టప్ బైజూ్‌సకి ఎన్‌సీఎల్‌టీ బెంగళూరు బెంచ్ గట్టి హెచ్చరిక చేసింది. ముందు ఉద్యోగుల జీతాల బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. లేకపోతే బైజూస్ ఆదాయ, వ్యయాల పుస్తకాలను ఐసీఏఐ ద్వారా ఆడిట్ చేయించాల్సి ఉంటుందని హెచ్చరించింది. రైట్స్ ఇష్యూ ద్వారా సేకరించిన 20 కోట్ల డాలర్లు తమకు అందుబాటులో లేనందున ఇప్పటికిపుడు ఉద్యోగుల జీతాలు చెల్లించడం సాధ్యం కాదన్న బైజూస్ వాదనని ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చింది. బైజూస్ ఇప్పటికే నడుస్తున్న బిజినెస్ సంస్థ కాబట్టి, వచ్చే ఆదాయం నుంచి ఉద్యోగుల జీతాలు చెల్లించడం పెద్ద సమస్య కాదని స్పష్టం చేసింది.