Share News

4 కొత్త ప్లాంట్లు ప్రారంభించిన అరబిందో ఫార్మా

ABN , Publish Date - Apr 02 , 2024 | 02:14 AM

అరబిందో ఫార్మా... పెన్సిలిన్‌-జి, 6-అమినో పెన్సిలానిక్‌ యాసిడ్‌ (6-ఏపీఏ), ఇంజెక్షన్లు, గ్రాన్యూల్‌ ఉత్పత్తుల తయారీ యూనిట్లు నాలుగింటిని సోమవారం ప్రారంభించినట్లు ప్రకటించింది...

4 కొత్త ప్లాంట్లు ప్రారంభించిన అరబిందో ఫార్మా

హైదరాబాద్‌: అరబిందో ఫార్మా... పెన్సిలిన్‌-జి, 6-అమినో పెన్సిలానిక్‌ యాసిడ్‌ (6-ఏపీఏ), ఇంజెక్షన్లు, గ్రాన్యూల్‌ ఉత్పత్తుల తయారీ యూనిట్లు నాలుగింటిని సోమవారం ప్రారంభించినట్లు ప్రకటించింది. తమ పూర్తి యాజమాన్య అనుబంధ విభాగాల ద్వారా ఈ యూనిట్లను ఏర్పాటు చేసినట్టు అరబిందో ఫార్మా తెలిపింది. ఇందులో పెన్సిలిన్‌-జి (పెన్‌-జి) తయారీ విభాగం కాకినాడ సెజ్‌లో ఉంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 15,000 టన్నులు. ఇది కాకుండా గ్లూకోజ్‌ ఉత్పత్తి సామర్థ్యం 1.8 లక్షలు, 6-అమినో పెన్సిలానిక్‌ యాసిడ్‌ ప్లాంట్‌ సామర్థ్యం ఏటా 3,600 టన్నులని అరబిందో ఫార్మా తెలిపింది.

Updated Date - Apr 02 , 2024 | 02:14 AM