Share News

వీ-గార్డ్‌ నుంచి అరిజో వైర్స్‌

ABN , Publish Date - Apr 12 , 2024 | 03:38 AM

ఎలక్ట్రికల్స్‌, ఎలకా్ట్రనిక్స్‌, హోమ్‌ అప్లయెన్సెస్‌ సంస్థ వీ-గార్డ్‌ మార్కెట్లోకి అరిజో వైర్స్‌ పేరుతో ఎలక్ట్రిక్‌ వైరింగ్‌ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. అడ్వాన్స్‌డ్‌ ఈ-బీమ్‌ టెక్నాలజీతో...

వీ-గార్డ్‌ నుంచి అరిజో వైర్స్‌

హైదరాబాద్‌: ఎలక్ట్రికల్స్‌, ఎలకా్ట్రనిక్స్‌, హోమ్‌ అప్లయెన్సెస్‌ సంస్థ వీ-గార్డ్‌ మార్కెట్లోకి అరిజో వైర్స్‌ పేరుతో ఎలక్ట్రిక్‌ వైరింగ్‌ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. అడ్వాన్స్‌డ్‌ ఈ-బీమ్‌ టెక్నాలజీతో ఈ వైర్లను కంపెనీ తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రమాణాలు, సామర్థ్యాలతో కూడిన ఈ అరిజో వైర్స్‌.. ఎలక్టికల్‌ విభాగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతాయని వీ-గార్డ్‌ పేర్కొంది. సాంప్రదాయ ఎఫ్‌ఆర్‌ పీవీసీ వైర్లతో పోల్చితే అరిజో వైర్స్‌ 75 శాతం అధికంగా విద్యుత్‌ను తీసుకువెళ్లగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వేడిని తట్టుకోవటంతో పాటు మెల్ట్‌ రెసిస్టెంట్‌, అగ్ని నిరోధకంగా ఈ వైర్లను రూపొందించటంతో గృహ, వ్యాపార సముదాయాలకు మంచి భద్రతను కల్పిస్తాయని వీ-గార్డ్‌ తెలిపింది. 99.97 శాతం స్వచ్ఛతతో కూడిన కాపర్‌తో తయారు చేసిన అరిజో వైర్స్‌కు ప్రతిష్ఠాత్మకమైన కన్ఫర్మిటీ యూరోపియన్‌ సర్టిఫికేషన్‌ (సీఈ)తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఉందని వెల్లడించింది. కాగా భారతీయ ఇండియన్‌ హౌసింగ్‌ వైర్స్‌, కేబుల్స్‌ మార్కెట్‌ ఏటా 9-10 శాతం వృద్ధితో రూ.25,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.

Updated Date - Apr 12 , 2024 | 03:38 AM